టీడీపీకి మోదీపై నమ్మకం లేదంటున్న రోజా…

వైఎస్ఆర్ సి పి అధినేత వైఎస్  జగన్  ప్రదాని నరేంద్ర మోదీ ని కలిసి ప్రత్యేక హోదా కల్పించిన వారికీ మా మద్దతు ఎప్పుడు ఉంటుందని రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు  ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.ఐతే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్ సపోర్ట్‌ చేస్తున్నామనగానే టీడీపీ నేతలు ఎందుకంత ఉలికిపాడుతున్నారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.మీడియాతో మాట్లాడుతూ,మోదీ మీద టీడీపీ నేతలకు నమ్మకం లేదన్నది ఈ వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తన నియోజకవర్గానికి తాగు నీళ్లు ఇవ్వలేని దేవినేని ఉమ.జగన్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు రోజా.

రాష్ట్రపతి పదవి గౌరవ ప్రదమైనదని,దాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచిదనే ఉద్దేశంతోనే జగన్ ఢిల్లీలో అలా మాట్లాడారని వెల్లడించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రజలంతా కష్టాలు పడుతున్నారని,ఆ ప్రజల కష్టాలు, రాష్ట్ర సమస్యలపై జగన్ ప్రధానిని కలిశారని రోజా స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు, అగ్రిగోల్డ్ వ్యవహారంపైనే ప్రధానిని జగన్ కలిసినట్లు తెలిపారు రోజా.

]]>