ఆ నీటిని వ్యూహాత్మకంగా వాడుకోవాలి ..సీఎం కే సిఆర్

రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనుల్లో పురోగతిపై ప్రగతిభవన్‌లో మంత్రులు, అధికారులతో సమీక్షించారు సీఎం చంద్రశేఖర రావు .ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు  సవాళ్లను అధిగమించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది వీలైనంతవరకు ఎక్కువ నీటిని సాగుకు ఇచ్చేలా ప్రాజెక్టులు అందుబాటులోకి తేవాలని సూచించారు .

ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమన్నారు. ప్రతి నెలా నీటిపారుదల ప్రాజెక్టులకు చెల్లింపులు కచ్చితంగా చేయనున్నట్టు చెప్పారు. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ సహా ఇతర పనులు సమాంతరంగా సాగాలన్నారు. 2018 మార్చి వరకు మేడిగడ్డ నుంచి నీరు తీసుకొనేలా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌ వరకు సాగునీళ్లు ఇవ్వాలన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారులు చైనాలో పర్యటించాలన్నారు. అధికారులు, ఇంజినీర్ల బృందం చైనాలో పరిస్థితుల్ని అధ్యయనం చేయాలన్నారు. అటవీ అనుమతుల కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో మాట్లాడనున్నట్టు చెప్పారు. కృష్ణా నదీ జలాలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని సూచించారు సీఎం.

 ]]>