"గాలి" ఇంట్లో లాంటి పెళ్ళే అనుకొంటున్నారు

గాలి జనార్ధన్‌రెడ్డి కూతురి పెళ్లి గురించి తెలుసుకదా గనుల కుంభకోణం లో జైలుకెళ్లొచ్చి  ,ఆ తర్వాత కూతురు పెళ్లి ఘనం గా చేసి అమాంతం  అందరి దృష్టిని ఆకర్షించాడు జనార్దన్ రెడ్డి సరిగ్గా గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో జరిగిన పెళ్లిలాంటిదే  ఇప్పుడు మరో ఖరీదైన పెళ్లి తెరపైకొచ్చింది  తెలంగాణలో. వెడ్డింగ్ కార్డులో వీడియో పెట్టడం ద్వారా గాలి జనార్ధన్‌రెడ్డి తన కూతురు పెళ్లి విషయంలో వార్తల్లోకెక్కారు. వివాహ ఆహ్వాన పత్రికలో వీడియోనా? అంటూ అందరూ నోరెళ్లబెట్టారు. ఇప్పుడు వీడియో కాదు.. ఏకంగా పెళ్లికి వేసుకురావాల్సిన దుస్తులే పెట్టారు. అంతేకాకుండా వాటితో పాటు ఓ కడియం కూడా ఇస్తున్నారు. అందుకే ఈ పెళ్లిని తెలంగాణలో అత్యంత ఖరీదైన పెళ్లిలా భావిస్తున్నారు. ఇంతకీ ఆ పెళ్లి ఎవరింట్లో అంటే

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, కేసీఆర్ వెన్నంటే ఉన్న రాములు నాయక్‌ ఇంట్ల జరిగే పెళ్లి ఆయన పోరుకు మురిసిపోయిన కెసిఆర్ ఆయన్ని ఎమ్మెల్సీ గా కూడా గుర్తించారు నాయక్ తన మూడో కుమారుడైన జితేంద్రనాయక్‌కు త్వరలో వివాహం చేయబోతున్నారు వెరైటీగా ప్లాన్ చేశారు. అతిథులందరికీ ఆహ్వానపత్రిక తో పాటే పెళ్లికి వేసుకురావాల్సిన దుస్తులు కూడా ఇచ్చేస్తున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ పింక్ పైజామా, రెడ్ బాటమ్‌తో పాటు లాల్చీను గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్సీలందరి కొలతలను తీసుకున్నారట. దుస్తులంతో పాటు ఓ వెండి కడియం కూడా ఆహ్వానపత్రికలో ఉంది.ఈ రేంజ్ కామన్ డ్రెస్ లో కడియలతో తిరుగుతుంటే …బారాత్  ధూమ్ ధామ్ హోగా ..
]]>