తెరాస ప్లీనరీ లో దిశానిర్దేశం కానుందా …ఎన్నికల వ్యూహమేనా

తెలంగాణ రాష్ట్రంలో  మూడో వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న  టీఆర్‌ఎస్‌ భవిష్యత్తు వ్యూహాలపై చర్చించా నున్నారు , రానున్న ఎన్నికల్లో  విజయం సాధించి మరో ఐదేళ్లు అధికారంలో కొనసాగటం లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కద మంత్రాంగాన్ని సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ, కేంద్రం నుంచి ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడుతుండటంతో పూర్తి అప్రమత్తంగా, ముందు చూపుతో వ్యవహరిస్తోంది.

రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతోంది.ప్రజలకు మరింత చేరువయ్యే లా ఈ ప్లీనరీ లో చర్చ జరగ నున్నదని  ప్లీనరీని వేదిక గా చేసుకొని దిశానిర్దేశం  కానుంది , 2001 ఏప్రిల్‌ 27న. పార్టీ పుట్టుకకు కారణమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను జూన్‌ 2, 2014న సాకారం చేసుకుంది. అదేరోజు అధికారాన్ని చేపట్టింది. పార్టీ పదహారేళ్లు ఏళ్లు పూర్తి చేసుకొని పదిహేడో ఏట అడుగు పెడుతున్న సందర్భంగా 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.

ఊహించని రీతిన పావులు కదిపి తెలంగాణ  రాష్ట్ర రాజకీయ చదరంగంలో సీఎం పైచేయి సాధించారు.తెలంగాణ లో ప్రధాన పార్టీగా పేరుపొందిన తెలుగుదేశంఎం పార్టీ ని ఆ రాష్ట్రము లో నామ రూపాలేకుండా చేసిన ఘనత కెసిఆర్ కె దక్కింది ,కాంగ్రెస్ తో  కయ్యానికి నిత్యం కాలు దువ్వుతున్నారు. ఇక కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు సారథ్యం వహిస్తున్న బీజేపీని టీఆర్‌ఎస్‌ ఇన్నాళ్లు ఒకింత సానుకూల కోణంలోనే చూసింది. పెద్ద నోట్ల రద్దు సహా వివిధ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌ బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర నాయకులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అంటీముట్టని విమర్శలకు పరిమితమయ్యారు.ఈ క్రమం లోనే తాజాగా మిషన్ భగీరథ ప్రారంభం కోసం ప్రధాని మోడీని ఆహ్వానించాలని పట్టుదలే మీద కెసిఆర్ ఉన్నట్టు సమాచారం,

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది. అందులో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఈ కారణంగానే రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు వరుస కడుతున్నారు. బూత స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే చర్యలకు పూనుకున్నారు. బీసీలు, దళితుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్కో రాష్ట్రాన్నీ వశం చేసుకుంటూ వస్తున్న నరేంద్ర మోదీ, అమితషాలు తర్వాత అడుగుగా తెలంగాణలో పాగా వేసేందుకూ సిద్ధమయ్యారు. ఈ విషయాల్ని ముందే గుర్తించిన కెసిఆర్ ఇటీవలే  ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు సిద్ధమయ్యారు.అంతే కాదు ఉచిత ఎరువులు ప్రకటించి, రైతులను కట్టి పడేసే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతలు కూడా ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, రాష్ట్రంలోని మిగిలిన వర్గాలను సమీకరించి తాము రాజకీయంగా బలపడటానికి రాష్ట్ర బీజేపీ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు.  ఈ  ప్లీనరీ ముందు జరగబోయే ప్లీనరీకి  దిక్సూచిగా ఉండబోతోందని ఆ పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది …

]]>