సర్వే చేసింది అందుకేనా …

‘కిందపడ్డా మీదపడ్డా పెబ్బె నేనే’ అంటే ఏమిటో తెలుసా? తెలియకున్నా.. నానుడు వినకున్నా పర్వాలేదు! ఒక్కసారి తెలంగాణ అధికార పక్షం నిర్వహించిన సర్వే ఫలితాలను చూస్తే చాలు.. అవే అర్థమైతాయి. ఎందుకంటారా? జనవరి నుంచి మార్చి వరకు రెండు దఫాలుగా అధికార టీఆర్ ఎస్ 119 మంది శాసనసభ్యుల జనాదరణపై సర్వే నిర్వహించింది. ఆ ఫలితాలను పత్రికలకు విడుదల చేసింది. అందులో తప్పేం లేదు. కానీ, ఆ పార్టీ అధినేత ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిఇతే తమ పార్టీకి ఏకంగా ‘నూటొక్క సీట్లు’ గ్యారంటీ అని ప్రకటించడమే విస్మయం కలిగిస్తోంది. ఎందుకంటే.. జాగ్రత్తగా విశ్లేషిస్తే.. ఆ అధికార సర్వే ప్రకారం అధికార పక్షానికి జనాదరణ తగ్గిందని తేటతెల్లమవుతోంది. నిజానికి తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచింది అక్షరాలా.. అరవై మూడు(63) స్థానాలు మాత్రమే! అంటే అవసరమైన సాధారణ మెజార్టీ (60)కి మూడంటే మూడు స్థానాలు మాత్రమే అధికం!! అప్పట్లో కొత్త రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా దానికి తిరుగులేని జనాదరణ ఉండేది. ఆ రోజుల్లోనే 63 స్థానాలకు ఆ పార్టీ పరిమితమైన వాస్తవం విస్మరించలేనిది. అనంతరం బీఎస్పీ తరపున ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎన్నికైన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప అధికారికంగా తమ శాసనసభా పక్షాన్ని టీఆర్ ఎస్ లో విలీనం చేయడం ద్వారా దాని ఆధిత్యం 63 కి పెరిగింది. అప్పట్లో కాంగ్రెస్ నుంచి 21 మంది, టీడీపీ నుంచి 13 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు, బీజేపీ నుంచి అయిదురు, సీపీఎం, సీపీఐ, వైఎస్ ఆర్సీపీ, తరపున ఒక్కొక్కరితో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. ఒక్కసారిగా ఫలితాలతో ఉలిక్కిపడిన అధికార పక్షం ‘ఆపరేషన్ ఆకర్ష్’ కు తెర లేపింది. ఇక ఫిరాయింపుల పర్వం మొదలై.. ఇతర పార్టీల నుంచి ఎన్నికైన వారు ఏకంగా మంత్రివర్గంలో చేరిపోయారు. దాంతో అధికార పార్టీ బలం ప్రస్తుతం 90 కి పెరిగింది. అయితే సాంకేతికంగా వారెవరూ అధికార పక్ష సభ్యులుగా ఇప్పటీకీ గుర్తింపు పొందలేదు. ఇప్పటీకీ.. అధికారికంగా టీఆర్ ఎస్ సభ్యుల సంఖ్య 65 మాత్రమే! 61 ఎమ్మెల్యేల గ్రాఫ్ డౌన్;- ఇక జనవరిలో ఎస్-1, మార్చి తొలివారంలో ఎస్-2 పేరిట సర్వేల అధికార పక్షం నిర్వహించింది. తొలి సర్వేకు మధ్యన ఏకంగా 61 మంది టీఆర్ ఎస్ శాసనసభ్యుల జనాదరణ గ్రాఫ్ పడిపోయింది. ఫిరాయింపుల ద్వారా 89 కి పెరిగిన సంఖ్య నుంచి జనాదరణ పడిపోయిన 61 మందిని మినహాయిస్తే.. అధికార పక్షం స్థిరంగా ఉన్నది 119 నియోజకవర్గాల్లో కేవలం 28 స్థానాల్లోనే! అయినా ఇప్పటికిప్పుడు నూటొక్క స్థానాలు గెలుస్తామని ప్రకటించడం విస్మయకరం. ఆ సర్వే వెల్లడించిన వివరాల మేరకు ఫలితాలను పాత జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ లో 9 నుంచి 5 కు… నిజామాబాద్ లో 9 నుంచి 6 కు… కరీంనగర్ లో 12 నుంచి 10 కు… వరంగల్ లో 11 నుంచి 5 కు… మెదక్ లో 9 నుంచి 4 కు… నల్లగొండ లో 8 నుంచి 6 కు.. ఖమ్మంలో 7 నుంచి 4 కు.. పాలమూరు లో 9 నుంచి 8 కు.. రంగారెడ్డి లో 11 నుంచి 9 కు.. హైదరాబాద్ లో 4 నుంచి 3 కు.. చొప్పున మొత్తం 119 స్థానాలలో ప్రస్తుతం టీఆర్ ఎస్ కు ఉన్న 89 స్థానాలకు గాను 61 స్థానాలలో టీఆర్ ఎస్ విజయావకాశాలు సన్నగిల్లాయని ఆ సర్వే తెల్చింది. ఈ మంత్రుల కథ అంతేనా?: ఆ సర్వే ప్రకారం జనాదరణ పడిపోయిన రాష్ట్ర మంత్రుల్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కరీంనగర్ నుంచి కల్వకుంట్ల తారక రామారావు, వరంగల్ నుంచి అజ్మీరా చందూలాల్, నల్గొండ నుంచి జి. జగదీశ్వర్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్ రావు, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్, పద్మారావు ఉన్నారు.⁠⁠⁠⁠]]>