శివరాత్రి విశిష్టత……

పండుగలంటే కేవలం విశ్రాంతి కి ఆహ్లాదం కోసమో కాదు.ప్రతి పండుగకు వైజ్గ్యానిక ,ఆరోగ్య,శాస్త్రీయ,కారణాలుంటాయి.ఈ రోజు మహా శివరాత్రి సందర్బం గా ఈ పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. శివరాత్రే యోగ రాత్రి,శివరాత్రి రోజు ప్రకృతి లో ఉండే తరంగాలు,అంతరిక్షం నుండి వెలువడే కాస్మిక కిరణాలూ విశ్వ మనవ వికాసానికి,మనిషి తన పరిపూర్ణమయిన రూపాన్ని తెలుసుకోవడానికి ,ఆత్మా సాక్షాత్కారానికి తోడ్పడతాయి.అందుకే శివరాత్రికి కొన్ని నియమాలు విదించారు పెద్దలు.

శివరాత్రి కి చేసే ఉపవాసానికి,జాగారనికి విశేష ప్రాదాన్యం ఉంది.శివరాత్రి అందరు ఉపవాసం చెయ్యాలని శాస్త్రం.ఉపవాసనికి ముందు రోజో,ఉపవాసం రోజు మాంసాహారం ముట్టకూడదు.ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి ,తల స్నానం చేసి “ఈ రోజు శివునికి ప్రీతి కరం గా ఉపవాసం చేస్తున్నాను “అని మనసులో అనుకోవాలి.

ఉపవాసం అంటే బాగావంతునికి దగ్గర అవ్వడం .ఆరోగ్య పరం గా చూసినప్పుడు ఉపవాసం శరీరం లో ని విష పదార్దాలు తోలింగించడం తో పటుశరీరం లో ప్రాణ శక్తిని,ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.మరీ నీళ్ళు తాగకుండా ఉపవాసం చేయమని ఎవరు చెప్పలేదు,శరీరాన్ని కాస్ట పెడుతూ,మనసుని దేవుని వైపు మరల్చడం కష్టం.ప్రకృతి లో ఉన్న శివ శక్తి మన శరీరం గ్రహించాలంటే,వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి.ఆలోచనలు పక్కన పెట్టి శివుని ని స్మరించండి.వీలయితే శివాలయం లకు వెళ్ళండి రుద్రబిషేకం చేస్తారు రుద్రం ఒక్కసారి చదవటానికి అరగంట పడుతుంది.శివాలయం లో ప్రశాంతం గా కళ్ళు మూసుకొని పండితులు చదువుతున్న ,నమ చమకములను వినడం ఏంతో ఫలదాయకం.

శివరాత్రి మొత్తం శివ నమస్మరణలో మీరు నిక్లిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది శివోహం అనే భావనను కలిగిస్తుంది.శివరాత్రి మరునాడు ఉదయం శివాలయానికి వెళ్ళి ప్రసాదం తెసుకున్న తర్వాత ఉపవాసం ముగించండి.

]]>