తెలుగువాడి ఆత్మ గౌరవానికి అక్షరాలా 36 వసంతాలు

తెలుగువారికి ఈరోజు  ఉగాది  పండుగ ..మరి తెలుగు దేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు , అభిమానులకు మరో పండుగ అదే  తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన ఈ రోజు. అన్నగారు స్వర్గియ నందమూరి తారకరామారావు  తాను ప్రాంతీయ పార్టీ పెడుతున్నట్టు మార్చి 21, 1982వ తేదీన ప్రకటించి మార్చి 29న మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా ప్రాంతీయ పార్టీ మొదటి సదస్సు ఏర్పాటు చేశారు.తన పార్టీ పేరు ‘తెలుగుదేశం’ అని ప్రకటించారు. పార్టీస్థాపించిన  9 నెలల కాలంలోనే ఎన్నికలలో చారిత్రక విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్… తన పాలనలో తొలి ఉగాది సందర్భంగా చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలివి ..

”ఉగాదులతో కలబోసుకున్నది తెలుగువారి చరిత్ర. తెలుగునాట ఒకనాడు పాడిపంటలు వెల్లివిరిసాయి. పాలు,తేనెలు పొంగిపొర్లాయి. కళామయూరాలు పురివిప్పి కళకళలాడాయి. పౌరుషం ప్రజ్వరిల్లింది. శాతవాహన, ఇక్ష్వాక, కాకతీయ, విజయనగర సామ్రాజ్యాల కాలంలో తెలుగుతేజం దిగ్దిగంతాలకు విస్తరించింది. అనంత కీర్తిని ఆర్జించింది.ఆ సమృద్ధిని సాధించి, అలనాటి తెలుగుజాతి గౌరవాన్ని, తెలుగువారి ఆత్మాభిమానాన్ని పునఃప్రతిష్టించి, తెలుగుప్రజాజీవితాన్ని సౌభాగ్యవంతం చేసి, తెలుగుభాషా సంస్కృతుల పునరుజ్జీవం సాధించాలన్నదే మా ఆశయం” ఈ మాటలు తల్చుకొంటేనే అన్నగారు మాట్లాడిన అనుభోతి కలుగక మానదు..

tdp

“అన్న” తారక రాముడు  రాజకీయాలలోకి రాకముందు నుంచీ సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా సినీరంగాన్ని ఏకం చేసి సహాయకార్యక్రమాలు చేపట్టేవారు. 1977లో దివిసీమ ఉప్పెన సంభవించి దాదాపు 20 వేల మంది చనిపోయారు. వేల కొద్దీ ఇళ్ళు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ సమయంలో సినీ రంగమంతా కదలివచ్చి ప్రజలను అన్నిరకాలుగా ఆదుకుంది. ఆ కార్యక్రమాలన్నిటిలోనూ ప్రముఖ పాత్ర పోషించిన ఎన్టీఆర్, విడిగా కూడా వ్యక్తిగతంగా సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వ్యక్తిగత విరాళాలు అందించారు.

ఈ ఫోటోలో కెమెరా వైపు చూస్తున్న వ్యక్తి స్వామి ప్రథమానందజీ. రామకృష్ణ మిషన్, బేలూరు మఠం నిర్ణయం మేరకు 11 గ్రామాలలోని తుఫాను బాదితులలో నిరుపేదలకు 1100 ఇళ్ళను కట్టించే పనిని ఆయన చేపట్టారు. ఆ కార్యక్రమాలు విజయవంతం అవడానికి ఎన్టీఆర్ అన్నివిధాలా సహకారం అందించడమే కాకుండా పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చారని స్వామి ప్రథమానందజీ చాలా చోట్ల ప్రస్థావించారు. అలా ఇళ్ళ నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని ఎన్టీఆర్ సందర్శించినప్పటి ఫోటో ఇది.

‘ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం’ అన్న ఎన్టీఆర్ తన జీవితంలో మొదటి నుంచీ ఆచరించి చూపిన మనో సిద్ధాంతం అది..

]]>