నవగ్రహాలకు దేవాలయాలున్నాయా ..ఇవేనా

తరచుగా మనం వినే మాట గ్రహ స్థితి  బాలేదు అని ..ఆలా గ్రహస్థితి బాగాలేని వారికోసం ఆయా గ్రహ శాంతి కోసం జపం దానం వంటి పీడోపహారణ కార్యక్రమాలు చేస్తుండటం ఐతే నవగ్రహాధి పతులకు కూడా దేవాలయాలున్నాయా అనే సందేహం ఎప్పుడోకప్పుడు వచ్చే ఉంటుంది ..దేవాలయాలు ఉన్నాయనేది ప్రాచుర్యం లో వుంది .ఆ వివరాలేమిటి చూద్దాం..

నవగ్రహములు తొమ్మిది , ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది. 1) సూర్యనార్ కోయిల్ – తిరుమంగళంకుడి. images (1)

తమిళనాడు రాష్ట్రము లోని తంజావూరు జిల్లలో కుంభకోణం నుండి 15 km దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో సూర్యనార్ కోయిల్ పిలువబడే సూర్యదేవలయము వున్నది. ఈ ఆలయములో సూర్యభగవానుదు ఆయన సతిమనులు అయిన ఉష , ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు .ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలం లో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది .ఈ ఆలయ ప్రగాణములో కాశీ విశ్వేశ్వరుడు విశాలక్షి ని , నవగ్రహాల చే ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకోవచు.ఈ ఆలయములో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము.ఈ ఆలయ పూజలు చాల నిష్ఠ గా జరుగుతాయి , పూజంనతరము ( పూజ తరువాత ) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్య వలసి వుంటుంది , మరియు ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురారోగ్యాలతో వున్నతరి అక్కడి భక్తుల ద్వారా తెలుస్తుంది ..

2) చంద్రగ్రహ దేవాలయము – తిరువైయార్ . chandra (1)

తిరువైయారుకు 5 k.m దూరములొ చంద్రగ్రహ దేవాలయము వుంది .తతిన్గాలుర్ కోవిల్ అని పిలువబడే చంద్ర దేవాలయము లోని చంద్రభగావానుని దర్శనము సుఖాన్ని , దిర్ఘాయుస్సున్ని , ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము .సెప్టెంబర్ – అక్టోబర్ మాసాలలో వొచ్చే ఫల్గుణ నక్షత్ర సమయాలలో చంద్రకాంతి ఇక్కడి ఆలయములోని శివలింగము పై సరాసరిగా ప్రసరించడము విశేషమైనది.

3) అంగారక (కుజ) గ్రహ దేవాలయము – తిరువైయర్ . kuja

తిరువైయర్కు 6 k.m దూరములొ అంగారక ( కుజ) గ్రహ దేవాలయము వున్నది .ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమపుతాడని భక్తుల విశ్వాసము , నమ్మఖము ,ధైర్యము , విజయము , శక్తికి అంగారకుడే కారణము వివాహము ఆలస్యము అయితే ఈ అంగారక క్షేత్రాని దర్శిస్తే వెంటనే వివాహము అవుతుందని స్థానికులు చెపుతున్నారు .

4) బుధగ్రహ దేవాలయము – తిరువెన్నాడు budha

అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది ,ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వ రుడు . అమ్మవారు బ్రహ్మ విద్యయంభికాదేవి వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు .కనుక ఈ ఆలయానికి 3000 ఏళ్ల నాటి చరిత్ర వున్నది అని తెలుస్తుంది .ఇక్కడ వ్యాపారానికి మరియు బుది ని ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజలకు నమ్మకము .

5) బృహస్పతి ( గురు) గ్రహ దేవాలయము – ఆలంగుడి. BRUHASPATHI

కుంభకోణానికి 18 k.m దూరములొ ఆలంగుడి లో గురు గ్రహ దేవాలయము వున్నది . ఈ ఆలయాని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు . ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము దీనిని క్రి.శ 1131 లో విక్రమచోళ చక్రవర్తి నిర్మిచారు .శివుడే దేవ గురువు బృహస్పతి నామధేయం తో గురుదక్షిణామూర్తి గా పూజలు అందుకుంటూన్న పుణ్యక్షేత్రము ఇది .భోళా  శంకరుడు ఇక్కడే హాలాహలాన్ని  సేవించి గోతులో దాచిన స్థలము ఇదే . ఆ విధము గా ఆపద నుంచి గట్టెకించిన  శివుణ్ణి ‘ ఆపత్ సహాయే శ్వ రర్ ( ఆపద్భాందవుడు ) గా కొలిచారు దేవతలు .గురుడికి ఇష్టమైన గురువారము నాడు , నానా బెట్టిన శనగలను పసుపుతాడుతో మాల గ చేసి గురు గ్రహానికి దండ వేసిన చదువులో ఆటంకాలు , వెనుకబడిన వారు చదువులో మరియు ఎ పని అయిన అయిపోవలిసిన వారికి , విద్యలో ఆటకములు , పనిలోనూ అన్ని తొలగి పోతాయని నమ్మకము గురు గ్రహ దోషాలు వున్నవారు ఆలం గుడి దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధములొ నేతితో 24 దీపాలు భక్తి తో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి , శాంతి కలుగుతుంది అని భక్తుల ప్రగాడా విశ్వాసము .

6) శుక్ర గ్రహ దేవాలయము – కామ్చనూరు . PBAAH

3 k.m దూరములొ శుక్ర గ్రహ దేవాలయము వుంది .దీనెకి పాలాశవనం , బ్రహ్మపరి , అగ్నిస్థలము అని పేర్లు కోడా వున్నాయి .ఇక్కడ తమ భార్యల ఆరోగ్యము కొరకు తమ భర్తలు పూజలు చేస్తారు .

7) శని గ్రహ దేవాలయము – తిరునల్లార్ .  

ఇది కుంభకోణం 53 k.m ధూరములొ వున్నది .ఇక్కడి నది తిర్ధములో స్నానం చేస్తే సర్వపాపాలు హరిన్చిపోతాయి అయిని భక్తుల నమ్మకము .ఈ ఆలయములో వెలిసిన శ్వమివారి పేరు దర్భారన్యేశ్వరుడు , ఈ దేవుడికి గారిక అంటే చాల ప్రీతి . అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రము గా భావిస్తారు . అందువల్ల ఈ స్వామిని దర్భాదిపతి అని కోడా అంటారు .ఈ దేవాలయములో దర్శించినపుడు భక్తులు దర్భల కోసలు ముడివేస్తారు . ఇలా ముడివేస్తే తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని భక్తుల నమ్మకము .ఇచట నలనారాయణ అనే విష్ణు దేవాలయము వున్నది ., ఇక్కడ నలదమయంతుల విగ్రహాలు వున్నా గుడి ఇదే .శనిశ్వరుని తో పాటు నలదమయంతులను పూజ చేస్తే శని ప్రభావము ఉండదు .ఇక్కడ బ్రహ్మదండ అనే తీర్ధము కొద వున్నది .ఇక్కడ శనిశ్వరుని కి నిత్యము అభిషేకము జరుగుతుంది .

8) రాహు గ్రహ దేవాలయము – తిరునగేశ్వరాము someswara

కుంభకోణం  5 k.m దూరములో వుంది .ఇక్కడ రాహు గ్ర్హమునకు గల దేవాలయము ఇది ఓక్కటే .ఇక్కడ నిత్యము వోచే రాహు కాల సమయములో పాలా భిషేకము చేస్తారు . ఆ పాలా భిషేఖము జరిపినపుడు రాహువు శిరస్సు పైన నుండి పాలు పోస్తే కంట భాగము ( మెడ ) దగరకు వోచేసరికి పాలు అన్ని నేలము రంగులోకి మారతాయి . మిగిలిన సమయాలలో ఇలా జరగదు .ఇక్కడ పూజలు చేసుకునేవారికి రాహు దోషాలు పోతాయి ..

9) కేతు గ్రహ దేవాలయము – కిల్ పేరుంపళ్లమ్ . kethu

తిరువేన్నాడ్ నుండి 6 k.m దూరములో వున్నది .ఈ ఆలయములో కేతు గ్రహ దోషానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .. ఈ ఆలయము వద్ద ఒక ప్లేటులో 7 ప్రమిదలలో దీపము వెలిగిస్తారు..ఇక్కద కేతు గ్రహానికి సంభందిచిన ఎ నివారణ పూజలు అయిన చేస్తారు ఈ ఆలయాలలో వధ గల 9 పుష్కరిణి లో స్నానములు చేసి 12 వారాలు ఆరాదిస్తే నవగ్రహాలను , ఈ నవగ్రహ అనుగ్రహము లభిస్తుంది .

]]>