"అత్త" వీలునామా "అల్లుడు" దగ్గర…

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళనాడు లో రోజుకో సమస్య తలెత్తుతోంది అటు రాజకీయపరంగా ఇటు అమ్మ ఆస్తుల పంపకం వైపు ప్రతి రోజు ఏదొక వేడి ఉండనే ఉంటోంది.అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు న్యాయస్థానం విధించిన జరిమానాను తీరుస్తానని ప్రకటించిన ఆమె మేనల్లుడు దీపక్ జయకుమార్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. తన అత్త, ఆస్తులకు సంబంధించిన వీలునామా తన దగ్గరే ఉందని ఆయన అన్నారు. అన్ని ఆస్తులూ నా పేరిట, నా సోదరి దీప పేరిట రాసి ఉన్నాయంటూ దీపక్‌ జయకుమార్‌ చేసిన ప్రకటన ఇప్పుడు తమిళనాడులో తీవ్ర చర్చకు కారణమైంది.

ఈ వీలునామా ప్రకారం చెన్నై పోయెస్‌ గార్డెన్‌ లోని బంగ్లా, చెన్నై పార్సన్‌ మేనర్‌ లోని రెండు కార్యాలయాలు, సెయింట్‌ మేరీస్‌ రోడ్డులోని నివాసం, కొడనాడు ఎస్టేట్‌, హైదరాబాద్‌ లోని ద్రాక్షతోట తదితర ఎనిమిది ఆస్తులు తనకు దక్కుతాయని దీపక్ జయకుమార్ వెల్లడించారు.

ఇది ఇలా ఉండగా  కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌ బంగ్లాలో హత్య, దోపిడీ జరిగాయి.జయలలిత ఆస్తుల వివరాలు, పార్టీకి సంబంధించిన కీలక పత్రాలు, భారీ ఎత్తున డబ్బు ఉందని, అందుకే అక్కడ హత్య దోపిడీ చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వినబడుతుండగా, కేవలం డబ్బు కోసమే ఆ దోపిడీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

]]>