కళాతపస్వి వల్ల దేశానికి ఎంతో మేలు :..మంత్రి తలసాని
కళాతపస్వి కె.విశ్వనాథ్ ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డు వరిడంచడంతో అంతా అభినందనల జల్లు కురిపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మా అధ్యక్షుడు శివాజీ రాజా, జాయింట్ సెక్రటరీ నరేష్ స్వయంగా విశ్వనాథ్ ఇంటికెళ్లి అభినందించారు.
అనంతరం తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, ఇప్పటివరకూ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మన తెలుగు వాళ్లైన బి.ఎన్. రెడ్డి, పైడి జైరాజు, ఎన్. వి. ప్రసాద్ , నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు గారికి అందించారు. ఇప్పుడు విశ్వనాథ్ గారిని ఆ అవార్డుతో సత్కరించడం సంతోషంగా ఉంది. ఆయన ప్రజలకు చేరువయ్యే ఎన్నో్ సందేశాత్మక సినిమాలు తెరకెక్కించారు.
`స్వర్ణకమలం` తో పాటు చిరంజీవి గారితో ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వరించాలి. కానీ ఆలస్యమైనప్పటికీ మంచి నిర్ణయంతో ఆయన్ను గౌరవించడం తో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లు అంతా గౌరవంగా భావిస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన్ను సన్మానం చేయమని చెప్పారు. ఆయన్ను గౌరవించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఒక్కరుంటే చాలు దేశానికి ఎంతో మేలు కలుగుతుందని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
`మా`అధ్యక్షుడుశివాజీరాజా,`మా`జాయింట్ సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ,మాయాబజార్`, `శంకరాభరణం, నుంచి ఇప్పటి బాహుబలి వరకూ భారతదేశంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీయడం జరిగింది. కె. విరెడ్డి, కె. విశ్వనాథ్ , రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమాను చాటారు అన్నారు.
]]>