రన్‌ వేపై విమానాలు ఢీ…తప్పిన ప్రమాదం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రన్‌ వేపై పెను ప్రమాదం తప్పింది.ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రన్‌ వేపై పైకి వెళ్తున్న ఓ విమానం.. పక్కనే ఉన్న మరో విమాన రెక్కకు తగిలింది.ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి అపాయం జరగలేదు. జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన 9డబ్ల్యూ603 విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్లాల్సివుంది. దీంతో విమానాన్ని మరల్చేందుకు పైలట్‌ ప్రయత్నించాడు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న మరో విమానం రెక్కకు జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం వెనుక భాగం తగిలింది.

]]>