బ్యాట్ పట్టు మొగుడిని కొట్టు….అంటున్న మంత్రి

పెళ్ళిళ్ళ సీజన్ రోజుకో ఫంక్షన్ కి వెళ్ళాలి వెళ్ళి ఊరకే తినేసి వస్తామా..డబ్బో.. వస్తువులో ఏదొక గిఫ్ట్ ఇచ్చే వస్తాం వెరైటి గిఫ్ట్ ఇస్తే ఎప్పుడు గుర్తుంటాం కదా…మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి గోపాల్ భార్గవ్ అలాంటి వింత గిఫ్ట్ ఇచ్చి ఇప్పుడు పాపులర్ అయ్యారు,అందులోను ఇప్పుడు మహిళలకి అది ఎంతో ఉపయోగకరమైన గిఫ్ట్…అదేoటో మీరూ చుడండి…

మధ్యప్రదేశ్ లో సామూహిక వివాహ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా 700 జంటలు ఒక్కటయ్యాయి.పెళ్లికి హాజరైన రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి గోపాల్ భార్గవ్.. అమ్మాయిలకు బ్యాట్ లను కానుకగా ఇచ్చారు.వీటిని స్థానికంగా మోగ్రీ అంటారు. వీటితో మురికిపట్టిన బట్టలు ఉతుకుతుంటారు. అయితే వీటిని తాగితందనాలు ఆడే మగాళ్లను కొట్టడానికి ఉపయోగించమంటున్నారు మంత్రిగారు. దీనితో పాటు… ఒక సలహా కూడా ఇచ్చారు. మొదట మాటలతో చెప్పి చుడండి వినకపోతే బ్యాట్ తో మాట్లాడoడి అని చెప్పారు.మీరు వేసే ఈ శిక్షకు పోలీసులు అడ్డు రారని కూడా సూచించారు. వాటిపై ‘తాగుబోతులను కొట్టే బ్యాట్’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాయించారు గోపాల్ భార్గవ్.ఏదేమైనా మంత్రి గారి గిఫ్ట్ ఆలోచన బావుంది.మంత్రిగారు మీ గిఫ్ట్ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారుఈ నూతన వధువులు

]]>