అసెంబ్లీ సమావేశాల్లో కునుకు తీసిన ఎమ్యెల్యేలు…

పరిపాలనలో పారదర్శకత వుండాలనే ఉద్దేశంతో తొలిసారిగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ని లైవ్ ప్రసారం చేసేందుకు అనుమతించారు.ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారో చూసే అవకాశం ప్రజలకి ఇవ్వాలనేది యోగి యోచన. కానీ తీరా టీవీల ముందు కూర్చుని చూసిన జనాలకి ఇదిగో ఈ స్లీపింగ్ సీన్ కనిపించింది. అన్నట్టు ఇక్కడ నిద్ర మత్తులో జోగుతున్న వారిలో ఆ రాష్ట్ర మంత్రి కూడా ఉన్నారు.

మండే యండల్లో సమవేశాలేంటి అనుకున్నారో,చల్లగా ఉoడేసరికే మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.ఓవైపు అసెంబ్లీలో జీఎస్టీ బిల్లుపై చర్చ జరుగుతోంది.మరోవైపు ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టి నానా రభస చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల వాదోపవాదనలతో అసెంబ్లీ అంతా గందరగోళంగా వుంటే, ఇదిగో వీళ్లు మాత్రం తాము బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనడానికి రాలేదు.సభ్యుల నినాదాలే వీళ్లకి జోలపాటగా అనిపించిందేమో స్లీపింగ్‌కే వచ్చామన్నట్టుగా ఏంచక్కా ఓ కునుకుతీశారు చూడండి. Uttar pradesh MLAs caught sleeping in assembly

]]>