2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యక్ష,పరోక్ష పన్నులను రెవీల్ చేసారు.బడ్జెట్ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది.వస్తువుల రేట్లుకొన్నిపెరగనున్నాయి.మరి కొన్ని వస్తువుల రేట్లు తగ్గనున్నాయి.ఇతర దేశాలనుంచి దిగుమతిని తగ్గించి,ఇండియా లో తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారట
**ధర పెరిగిన వస్తువులు
సిగరెట్లు,పాన్ మసాల,పేపరు చుట్టిన,చేతితో తయారు చేసిన బీడీలు,పొగాకు ఉత్పత్తులు,ఎల్ ఈడీ దీపాల విడిభాగాలు, వెండి పతకాలు, 99.9%స్వచ్ఛత ఉన్న వెండి నాణేలు,సాల్టెడ్ జీడి పప్పు ధరలు పెరగనున్నాయి,భారత్‌లో తయారయ్యే మొబైల్ఫోన్లు,ఫోన్లలో వాడే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీ)లను ఫోన్ తయారీ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.ఇండియా లో తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం.అలా దిగుమతి చేసుకునే పీసీబీలపై ప్రత్యేక అదనపు డ్యూటీ విధించింది.కార్లు,మోటారు సైకిళ్ల బీమా ఇవాళ్టి నుంచి పెరగనుంది.
**ధర తగ్గిన వస్తువులు
సౌర శక్తితో పనిచేసే ఉపకరణాలు,ఇళ్లల్లో వాడే ఆర్వో వాటర్ ఫిల్టర్లు,వాటిలోని ఆర్వో కాంపొనెంట్ల డ్యూటీ రేట్లు,తగ్గించినందున వాటి ధరలు తగ్గనున్నాయి.ఆన్ లైన్ రైల్వే టికెట్లు,లెదర్ తో తయారయ్యే ఉత్పత్తుల్లో కొన్ని వస్తువులు,పీఓఎస్ యంత్రాలు/ కార్డులు,ఫింగర్ ఫ్రింట్స్ ఆధారంగా పని చేసే యంత్రాలు,రక్షణ బలగాలకు వర్తించే సామూహిక బీమాకు సంబంధించినవి తగ్గనున్నాయి.
]]>