గురువులా రాక్షసులా….

మంచి చెడు లు నేర్పాల్సిన వారు,చెడు దారిలో ప్రవర్తిస్తే,విద్య నేర్పాల్సిన వాడు పశువుల ప్రవర్తిస్తే,గురువే దైవం అంటారు,విద్య నేర్పే గురువు దేవుడితో సమానం అంటారు ఆ గురువే పామై కాటేస్తే,ఎం చేయాలి అలాంటి గురువుల రూపం లో ఉన్న రాక్షసులని,ఒక్కడు కాదు ఏకం గా 8 మంది గురువులు సంవత్సరన్నర నుంచి 13 ఏళ్ళ అమ్మాయిని క్రూరం గా అనుభవిస్తూ నరకం చూపించారు.ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.ఆ అమ్మాయి తీవ్ర అనారోగ్యానికి గురి కాగా తల్లి తండ్రులకు అసలు విషయం తెలిసింది.వీడియోలు ఫోటో లు తీసి బెదిరించారని చెప్తోంది.ఇప్పుడు ఆ అమ్మాయి బ్లడ్ క్యాన్సర్ తో బాదపడుతోంది.ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ ఈ ఘటన  చాలా బాధాకరమని, దురదృష్టకరమని, బాధితురాలికి వైద్యం చేయించే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. ముఖ్యమంత్రి వసుంధర రాజె వ్యక్తిగతంగా ఈ కేసును పరిశీలిస్తున్నారని చెప్పారు.

]]>