భాహుబాలి సినిమా కి తెలంగాణా సర్కార్ కండిషన్స్ ఇవే….

భాహుబలిసినిమారావడంఏమో కానీ వ్యాపారస్తులు మత్రం సొమ్ము చేసుకోవాలి అనుకుంటున్నారు.ఇలాంటి వాటికి తెలంగాణా ప్రభుత్వం చెక్ పెట్టింది.

బాహుబలి  సినిమా ధియేటర్లకు షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతి లేదని రోజుకు 5 ఆటలకే అనుమతి ఉందని స్పష్టం చేసింది. ఒక్కో టికెట్ వేలల్లో అమ్ముతున్నారన్న విషయం తెలిసిన తెలంగాణా ప్రభుత్వం సీరియస్ అయ్యింది.నిర్ణయించిన టికెట్ ధరల కంటే అధికంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.మల్టీఫ్లెక్సుల్లో కాంబో ప్యాక్ పేరుతో టికెట్ తోపాటు పాప్ కార్న్, కూల్ డ్రింగ్ ఇచ్చే విధానాన్ని తప్పుబట్టింది.ఎక్కడైనా కాంబో పేరుతో అధిక ధరకు టికెట్లు విక్రయిస్తే.

ఆ ధియేటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది వినియోగదారుల హక్కుల హరించటమే అని అభిప్రాయపడింది.రెండు రోజులలో మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా.కొన్ని సినిమా ధియేటర్లు రేపు రాత్రి 10 గంటలకే షో వేస్తూ,ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఓపెన్ చేశారు. దీనిపైనా స్పందించారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. బెనిఫిట్ షోలు వేయరాదని ఆదేశించారు.బాహుబలి 2 మూవీ టికెట్లను అధిక ధరలకు అమ్మితే టోల్ ఫ్రీ నంబర్ 1800-4253787 నంబర్ కు కంప్లయింట్ చేయాలని వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ప్రకటించారు.

Bahubali2]]>