ఇవి వయసు ను కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయట….

కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. సాధారణంగా  మనం తీసుకునే ఆహారమే మన అందాన్ని, ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మన శరీరానికి రక్షణ కవచమైన చర్మం మన ఆరోగ్య స్థితిని చెప్పకనే చెబుతుంది. పుట్టిన నాటి నుంచి మన శరీరంతో పాటు చర్మంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. చిన్నపిల్లలప్పుడు లేత చర్మం పెద్దవాళ్లయ్యేప్పటికి పూర్తిగా మారిపోతుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగే మార్పే అయినా సరైన ఆహారం, చక్కటి జీవనశైలి ద్వారా వృద్ధాప్యపు జాడలని మన దరికి చేరనీయకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు. మీకోసం కొన్నిచిట్కాలు…..

క్యారెట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటీ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఇవ్వటంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి. కాబట్టి మెరిసేటటువంటి చర్మ సౌందర్యం పొందాలనుకుంటే ప్రతి రోజూ క్యారెట్ తినడం కానీ, లేదా క్యారెట్ జ్యూస్ తాగడం కానీ చేయాలి

  దోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ ‘కె’ సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి. ముఖానికి రిఫ్రెషనస్ బనానా అరటిపండును చర్మ సంరక్షణ గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు. బనానా మాయిశ్చరైజర్ తో ముఖానికి రిఫ్రెషనస్ వస్తుంది.అరటి పండును తిన్న మంచి ఫలితం ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియలో ఆరెంజ్ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది. విటమిన్ ఇ, ఎ, సి . కొలాజెన్ ఉత్పత్తికి,మెయింటెన్ చేయటానికి సహాయపడే వీటిని తినే ఆహారం ద్వారా సులువుగా శరీరానికి అందించవచ్చు.

బొప్పాయి బొప్పాయిన మన పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్నారు. పాపాయలో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ మరియు ఎంజైములను ఫుష్కలంగా…ఉంటాయి. యాపిల్ ను ఆహరంలో ఓ భాగంగా చేసుకోవాలి. ఈ పాండులో లబించే పొటాషియం, ఫాస్ఫరస్ చాల మేలు చేస్తుంది.

వేరు శనగల్లో అధిక మోతాదులో ఉండే విటమిన్ ఇ, సిలీనియం, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తిలో సహకరిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపరచి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి.

బీట్ రూట్ దుంపల్లో అధిక శాతంలో ఐరన్ మరియు విటమిన్స్ ఉండి, చర్మగ్రంధులను శుభ్రం చేయడానికి, రక్త ప్రసరణ జరగడానికి, ముఖంలో పింక్ గ్లో తేవడానికి సహాయపడుతాయి. కాబట్టి ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగాలి. అలాగే దీన్ని ఫేస్ ఫ్యాక్ గా కూడా వేసుకోవచ్చు. జింక్, సల్ఫర్ పళ్లు,కాయగూరల్లో లభ్యమయ్యే ఈ ఖనిజాలు కొలాజెన్ ఉత్పత్తిని పెంచి సంరక్షిస్తాయి

కివి ఇది ఒక సిట్రస్ ఫ్రూట్. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది సహజంగా చర్మ ఛాయను మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ కివి పండును తాజాగా తినవచ్చు. మరియు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, ముఖంలో రంద్రాలు తొలగిపోయి, ముఖo బ్యూటిఫుల్ గా కనబడుతుంది

వయస్సును తగ్గించడంలో ప్రతి రోజూ మనం తీసుకొనే డైయట్ లో నీరు కూడా ఒక భాగమే. నీరు ఇంటర్నల్ గాను, ఎక్సటర్నల్ గాను మంచి ప్రయోజనకారి. ప్రతి రోజూ ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరానకి కావల్సిన తేమ అంది ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు క నీసం 6-8 గ్లాసుల నీళ్లు తాగటం అన్నది స్వేదగ్రంథుల నుంచి విషపదార్థాలను బయటికి విసర్జించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

]]>