ఒంటరి మహిళా బృతికి అర్హులు వీరే….

ఒంటరి మహిళలకు ఆసరా ఫించను ఇచ్చేందుకు ప్రభుత్వం ఆర్డర్స్ జారి చేసింది.జూన్ నుంచి అర్హులైన అభ్యర్డులకు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు అకౌంట్ ద్వార లబ్దిదారులకు ఫించను అందుతుంది.ఈ నెల 8 నుంచి దరకాస్థుల స్వీకరణ జరుగుతుంది.అర్హులైన వారు అప్లై చేసుకోవాలని తెలంగాణ సర్కార్ ప్రకటన చేసింది.నెలకు 1000 రు.. బృతిని ఏప్రియల్ నెల నుంచి అమలు చేస్తోంది,జూన్ 2 న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా ఆ రోజు నుంచి అర్హుల ఎకౌంట్స్ లో ఫించన్ వేయనున్నారు.ఈ రెండు నేలల బృతిని కలిపి జూన్ రెండు న రెండు వేల రూపాయలు లబ్ది దారుల అకౌంట్స్ లో వేయడం ద్వార సర్కార్ ఈ వినూత్న పతకాన్ని ప్రారంభిస్తుంది. ఇవే కాకుండా ఒంటరి మహిళా బృతి పొందుతున్న వారికీ ఆయా జిల్లాల కలెక్టర్లు భూమి కొనుగోలు పథకం కింద భూమిని కేటాయించడం లేదా పాడి పశువుల అంద జేత లేదా బ్యాంకు అనుసందానం ద్వారా గొర్రెల యూనిట్ల మంజూరి లేదా స్వయం ఉపాది యూనిట్లు,నైపుణ్య వృద్ది వంటి ఏదో ఒక దాన్ని ఆయ అర్హతల ఆదరంగా జీవన బృతి పథకాల్లో భాగంగా సమకూరుస్తుంది తెలంగాణా సర్కార్.

బృతికి అర్హతలు…

**భర్త నుంచి విడి పోయి సంవత్సర కాలం అయి ఉండాలి.

**ఇంతకు ముందు ఎటువంటి సామాజిక భద్రత ఫించను,ప్రభుత్వ,ప్రభుత్వ రంగ సంస్తల ఫించన్ లు అందకూడదు.

**ఒంటరి మహిళకు తిరిగి వివాహం జరిగినా,శాశ్వత ఉపాది లేదా ఆర్దిక సుస్తిరత లబించిన సాయం నిలిచి పోతుంది.ఆమె పరిస్తితి పై ప్రతి మూడు నెలలకోసారి ఏంపిడిఓ లు మున్సిపల్ కమీషనర్ లు ఆర తీస్తారు.

**అర్హులు తమ ఫోటో తో కూడిన దఖస్తుకు ఆదర్ లేదా ఓటర్ గోర్తింపు కార్డ్ వంటి వాటిని జత చేయాలి.

**అల జత చేసిన దరకాస్థులను పంచాయితీ కార్యదర్సులకు,బిల్ కలేక్టర్లకు,ghmc పరిధి లో విఆర్వో లకు అందజేయాలి.

]]>