చెట్టుకిందకు వెళ్లి మరీ ప్రాణాలు పోగొట్టుకున్నారు

తలదాచుకుందామని చెట్టుకిందకు వెళ్లి ప్రాణాలే పోగొట్టుకున్నారు కర్నూలు జిల్లాలోని పెద్దకడుబూరు మండలం చిన్న తుంబలం గ్రామంలో ఈ ఘటన జరిగింది.బసలదొడ్డి గ్రామానికి చెందిన రంగమ్మ(50) తన మనవరాలు అంజలి(7)తో కలిసి తుంబలంలో ఉన్న పొలానికి వెళ్లింది. పొలం పనులు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది  దీంతో పొలం గట్టున ఉన్న తుమ్మ చెట్టు కిందకు వెళ్లారు అయితే ఉన్నట్టుండి ఆ చెట్టుపై పిడుగు పడింది.

చెట్టు కింద ఉన్న ఇద్దరూ  పిడుగు పాటుకు బలైపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనతో బసలదొడ్డి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. అవ్వ, మనవరాలి మృతదేహాలను చూసి బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.వర్షాలు పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లకూడదని అనాది గ చెప్తున్నా వెళ్లక తప్పట్లేదు ప్రాణాలు పోక తప్పట్లేదు
]]>