ఈ బైక్స్ ఐ ఫోన్ కన్నా చీప్…..

చేతిలో ఫోన్ లేనివాడు లేనట్లే, బీఎస్-3 వాహనాలపై నిషేధం విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ పుణ్యమాని అందరి చేతుల్లో బండ్లు ఉంటాయేమో,ఇప్పుడు బైక్ లు 20 ,30 వేలు తగ్గించి ఇస్తున్నారు.మంచి మంచి ఆఫర్స్ తో బైక్స్ ని అమ్ముతున్నారు.ఈ రేట్స్ కి సామాన్యుడు కూడా బండి కొనుకోవచ్చు కానీ తర్వాత వాటికీ కోసం ఆర్ డి ఓ ల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అంటున్నారు కొందరు..ఆలోచించండి.షోరూం లు మాత్రం దీపావళి,దసరా,సంక్రాతి పండగలప్పుడు బట్టల షాప్ లు ఉన్నట్లు కస్టమర్లతో కళ కళ లాడుతున్నాయి.

బైక్ ల ఆఫర్స్ ఎలా ఉన్నాయో చుడండి.

బీఎస్-3 వాహనాలపై టూ-వీలర్స్ దిగ్గజాలు రూ.22వేల వరకు డిస్కౌంట్ ప్రకటించాయి. దీంతో 150సీసీ బైక్ ఐఫోన్ కంటే తక్కువ ధరకే లభ్యమవుతుందట. నమ్మట్లేదా అయితే ధరలు మీరే ఓసారి చూడండి… ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) ధర రూ.82వేలు. నేడు సుజుకీ జిక్సర్ ధర షోరూంలో రూ.77,452లకే దొరుకుతోంది. సుజుకీ జిక్సర్ మాత్రమే కాక, యాక్టివా 3జీ కూడా 50,290కు, డ్రీమ్ యుగ 51,741 రూపాయలకు, సీబీ షైన్ 55,799 రూపాయల నుంచి 61,283 రూపాయల వరకు, సీడీ 110డీఎక్స్ 47,202 రూపాయల నుంచి 47,494 రూపాయల ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ బైకులకు హోండా రూ.22వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించడంతో ధరలు కిందకి తగ్గాయి

హీరో బైకులపై ఉన్న ఆఫర్లు…

హీరో మోటార్ కార్పొరేషన్ కూడా బీఎస్-3 టూ-వీలర్స్ పై రూ.12,500 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో స్కూటర్స్ డ్యూయెట్, ఐఫోన్ కంటే చీప్ గా రూ.49,480కు అందుబాటులోకి వచ్చింది. ఇక మాస్ట్రో ఎడ్జ్ నైతే రూ.51,030కే కొనుకోవచ్చు. ప్రీమియం బైకులపై రూ.7500, ఎంట్రీలెవల్ బైకులపై రూ.5000వేల వరకు హీరో ఆఫర్ ప్రకటించింది. దీంతో గ్లామర్ రూ.59,755కు, స్ప్లెండర్ 125 రూ.55,575కు కొనుకునేలా ఆఫర్ ఉంది. ఒక్క హీరో, హోండా కంపెనీలు మాత్రమే కాక, సుజుకీ బైకులు, బజాజ్ బైకులు కూడా ఐఫోన్ కంటే తక్కువ ధరకే మార్కెట్లోకి వచ్చాయి.

]]>