హీరో,డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తన తల్లి కన్మణికి గుడి కట్టించి,తల్లి విగ్రహాన్ని తయారు చేయించిన విషయం తెలిసిందే ఆ గుడి ని ఈ రోజు మదర్స్ డే సందర్బంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ప్రారంభించారు.స్థానిక అంబత్తూర్లో లారెన్స్ కొన్నేళ్ల క్రితం నిర్మించిన రాఘవేంద్ర ఆలయ ప్రాంగణంలో తల్లికీ గుడి కట్టించారు. ఆదివారం ఉదయం ఈ ఆలయాన్ని స్టంట్‌మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ చేతుల మీదుగా ప్రారంభించారు.కెరీర్ ప్రారంభంలో కష్టాల్లో ఉన్న లారెన్స్‌ని సుబ్బరాయన్ మాస్టర్ ఆదుకున్నారు. ఆ అభిమానంతోనే తన తల్లికి గుడిని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు.ఆ సందర్భంగా 1000 మంది మాతృమూర్తులకు చీరలు, ఆరుగురు మహిళారైతులకు సహాయం అందజేశారు లారెన్స్. ఈ గుడి ప్రపంచంలోని అందరి అమ్మలకు అంకింతం చేస్తున్నట్లు తెలుపాడు. గుడి ప్రారంభోత్సవానికి వచ్చే ప్రతీ ఒక్కరూ తమ తల్లిని తోడు తీసుకు రావాలని కోరుతూ అడ్రస్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు లారెన్స్.దీంతో బతికుండగానే తల్లికి ఆలయం కట్టించిన తొలి నటుడిగా లారెన్స్ చరిత్రలో నిలిచిపోనున్నారు