సాధారణముగా మనం వాడుకునే వస్తువుల ను సులువైన పద్దతి లో శుభ్రపరుచుకునేందుకు కొన్ని చిట్కాలు…
**డైమండ్ చెవిరింగులను 15 నిమిషాల పాటు నీటి లో నానబెట్టండి.ఈ నీటికి కొంచెం వాషింగ్ పౌడర్ కలిపి 10 మినిట్స్ వేడి చెయ్యండి.తర్వాత నీటి లోంచి తీసి మృదువైన క్లోత్ తో తుడిచి చూడంటి అవి మెరుస్తాయి.
**చేదు మందులు వేసుకోవాలంటే భాద గా ఉందా ఐతే రెండు నిముషాలు ఐస్ ని నాలుక పై ఉంచండి నాలుక మొద్దు బారుతుంది ఆ తర్వాత ఎంత చేదు మందైనా మీకు టేస్ట్ తెలియదు.
**లెదర్ షూస్ టైట్ గా అనిపిస్తున్నాయా ?రాత్రి పూట వాటికీ కొంచెం పెరుగు రాయండి తర్వాత వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటాయి.
**మిగిలిపోయిన డికాషన్ లో నీరు కొంచెం పోసి..ఈ లిక్విడ్ తో అద్దాలు తుడవండి..చాల బ్రైట్ గ కనిపిస్తాయి.
**కందిరీగ కుడితే అది కుట్టిన చోట యాస్ప్రిన్ టాబ్లెట్ తో రబ్ చేయండి నొప్పి పోతుంది.
**లెదర్ బ్యాగ్,బెల్ట్ షైనింగ్ పోయిందా?అరచెంచా రోజ్ వాటర్,ఒక స్పూన్,గ్లిసరిన్,అరా చెంచా కొబ్బరి నూనెల మిశ్రమాన్ని కాటన్ తో లేదా మృదువైన బట్ట తో తుడవండి కొత్తవాటి ల మెరుస్తాయి.
**పప్పు వండిన నీరు ,అన్నం వార్చిన గంజి మొక్కల కు పోయండి అవి బాగా పెరుగుతాయి.
**పాయసం మరి తీయగా అయ్యిందా ?ఐతే అందులో అరచెంచా వెనిగర్ వేసి బాగా కలపండి తీపి తగ్గుతుంది.
]]>