మరో రెండు భాషల్లో బాహుబలి….

తెలుగు సిని ఇండస్ట్రీ ని ప్రపంచ స్థాయి లో నిలబెట్టి  ప్రపంచ రికార్డులను సైతం తిరగరాస్తున్న ‘బాహుబలి-2’ ప్రభంజనం మరిన్ని దేశాలకు విస్తరించనుంది. నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియాతో పాటు అమెరికా, కెనడా, దుబాయ్‌, సింగపూర్‌ లాంటి దేశాలలో హవా సృష్టిస్తుండగా, ఇప్పుడు మరో రెండు భాషల్లోకి రీమేక్ చేయాలనీ దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీ మొదటి భాగంలో చైనాలో కూడా మంచి టాక్‌ తెచ్చుకోవడంతో ఇప్పుడు రెండవ భాగాన్ని కూడా ఆ భాషలోకి అనువదించాలని అనుకుంటున్నారట. అలాగే జపాన్‌లో ఇండియన్‌ సినిమాలకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా అక్కడ కూడా మూవీని డబ్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చల్లో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ రెండు దేశాలను కూడా  బాహుబలి ఎలనున్నాడేమో వేచి చూడాలి

]]>