గులాబి పండుగ..ధూం ధాం

జనహోరుగల్లుగా మారిన వోరుగల్లు.వరంగల్లులో పదహారోవ వార్షికోత్సవ ఉత్సవాలు,టిఆర్ఎస్ ఆవిర్బావ వేడుక గనంగా జరుగుతోంది.టిఆర్ఎస్ ఆవిర్భవించి ఎన్నో వోడిదుడుకులను తట్టుకొని ఈ రోజు 16 సంవత్సరాలను దిగ్విజయం గా పూర్తీ చేసుకుంది.ఎగురుతోంది ప్రతి గుండె లో గులాబి  రంగు జెండా ఎగురుతోంది….,వీరతెలంగాణమా నలుగు కోట్ల ప్రాణమా అంటూ….కొమ్మలల్లో కోయిలమ్మ పాట పడుతున్నది జై తేలగాణ అన్నది.అచ్చ తెలుగు తెలంగాణా యాసతో సాంస్కృతిక కార్యక్రమాలతో సమ్మక్క సారక్క జాతర మరో సరి వచ్చినట్లుంది.వరంగల్ గులాభి మయం అయ్యింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి తరలివచ్చిన జనంతో.. మైదానం కిక్కిరిసింది. ఎటు చూసినా జనమే, మహిళలు సైతం భారీ సంఖ్యలో తరలివచ్చారు. జై తెలంగాణ… జై కేసీఆర్.. జై జై టీఆర్ఎస్ నినాదాలతో సభా ప్రాంగణం మొత్తం మార్మోగుతోంది. కళాకారుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.మహిళ రక్షణగా చుట్టూ బారిగేట్లు ఏర్పాటు చేశారు. లక్షల మంది జనంతో పోలీసులు సైతం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

టీఆర్ ఎస్ ఎంపీ కేశవరావు మాట్లాడుతూ.కేసీఆర్ అందరికీ పెద్దన్న అన్నారు.లక్ష మందితో నిండిపోయిన ఈ సభ ద్వారా టీఆర్ ఎస్ బలం తెలుస్తోందన్నారు.కానీ బాధ్యత కూడా అంతే ఉంది పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ప్రజలకు తోడుగా కేసీఆర్ ఉంటారన్నారు కే కేశవరావు. అమ్మ అడగనిదే అన్నం పెట్టదన్నారు. కానీ మనం అడగకుండానే.అన్నం పెట్టే అన్నయ్య కేసీఆర్ అన్నారు.ఫుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ ఇచ్చి.ఏ బాదరా బందీ లేని వాళ్లకు ఆసరా పించనల్ తో ఆదుకుంటున్నారు అన్నారు.

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అందించేందుకు అసెంబ్లీ తీర్మానం చేసి.కేంద్రానికి పంపిన ఏకైక సీఎం కేసీఆర్ అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.రాష్ట్రంలో మైనార్టీల కోసం 200 రెసిడెన్షియల్ స్కూళ్లు ఓపెన్ చేశామన్నారు.షాదీముబారక్ పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రూ. 200 పించన్ ఇచ్చే వాళ్లన్నారు. కానీ ఇవాళ రూ. 1000 పించన్ ఇస్తున్నారు కేసీఆర్,ఇప్పుడు అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు కదులుతున్నాయన్నారు మహమూద్ అలీ . ]]>