మిర్చి రైతులను పరామర్సించనున్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి

ఖమ్మం మిర్చి యార్డ్ లో రైతులు ఆందోళన జరిపిన విషయం తెలిసిందే,యార్డ్ లో ఇంకా అదే టెన్షన్ వాతావరణం నెలకొంది.రాజకీయనాయకులు యార్డ్ లోకి రావడానికి వీలు లేదంటూ అధికారులు ఆంక్షలు విదించారు.ప్రబుత్వమే మిర్చిని కొనలంటూ ఆందోళన చేస్తున్న రైతులను కలిసేందుకు ఈ రోజు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఖమ్మం రానున్నారు.

తక్షణమే ఉచిత ఎరువుల పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు టీటీడీపీ నేత రేవంత్‌ రెడ్డి. తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న అన్నదాతల ఆవేదన కట్టలు తెగుతోందని, ఖమ్మం మార్కెట్ యార్డులో జరిగిన ఘటనే దీనికి నిదర్శననమని ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఈ ఖరీఫ్ నుంచే ఎరువులు ఫ్రీగా ఇవ్వాలన్నారు.బడ్జెట్ కేటాయింపులు లేవని సాకులు చెప్పకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సవరణలు ప్రతిపాదిస్తే తామందరం ఏకగ్రీవంగా అమోదిస్తామన్నారు.సమగ్ర కుటుంబ సర్వేతో ఒక్క రోజులో నాలుగు కోట్ల జనం వివరాలు సేకరించారన్న రేవంత్‌, ఇప్పుడు అవసరమైతే ఓ పది రోజుల సమయం తీసుకొని రాష్ట్రంలోని 55లక్షల మంది రైతుల వివరాలు సేకరించాలని కోరారు.

]]>