మామయ్య ఎప్పుడో చెప్పాడు.

సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ,అసలు గెలుపంటే ఏమిటో తనకి తన మావయ్య పవన్ కళ్యాణ్ చెప్పాడని అన్నాడు. ఒకసారి తాను పొందిన ఒక అవార్డును తీసుకుని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి, తాను గెలుచుకున్నట్టు చెబుతూ ఆ అవార్డును చూపించాడట.ఓటమి సమయంలోను అండగా నిలిచేవారిని సంపాదించుకోవడమే నిజమైన గెలుపని మావయ్య చెప్పాడనీ, గెలుచుకోవలసింది అభిమానుల మనసులను అనే విషయం అప్పుడు తనకి అర్థమైందని అన్నాడు. అప్పటి నుంచి ఆ దిశగానే తన ప్రయాణం కొనసాగిస్తున్నానని అన్నాడు.విన్నర్ సినిమా టీమ్ ఎంతో అంకితభావంతో పనిచేసిందనీ, ఈ నెల 24వ తేదీన విడుదలవుతోన్న ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.

]]>