ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లొచ్చాయి తెలుసా

ఎండాకాలం ఏమిటి  బ్యారేజ్ నుంచి నీళ్లు రావడం ఏమిటా అని అనుకొంటున్నారా చదవండి ఆశ్చర్యం కలిగించే ఇంట్రస్ట్యింగ్ టాపిక్ ఆశ్చర్యంగా ప్రకాశం బ్యారేజీ లోంచి నీళ్లువస్తున్నాయి అది చూసిన అధికారులకు ప్రాణం పోయే అంతటి పని అయ్యింది.మతి స్థిమితం లేని  ఓ వ్యక్తి విజయవాడలోని ప్రకాశం బ్యారేజి 58, 59 గేట్ల ను ఎత్తాడు.దీనితో ఆ గేట్ల నుండి నీరు రావడం గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. మధ్యాహ్న సమయంలో బ్యారేజీ నుంచి నీళ్లు వస్తుండటంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు.

వెంటనే కంట్రోల్‌ రూం వద్ద కు పరుగులు తీశారు. గేట్ల నియంత్రణ గదిలో రెండు స్విచ్‌లు ఆన్‌ చేసి ఉన్నట్లు గమనించారు. గేట్లను దించేసి నీటి ప్రవాహాన్ని ఆపేసి ఊపిరి పీల్చుకున్నారు. భోజన సమయం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.ఈ ఘటన.. ప్రకాశం బ్యారేజీ నిర్వహణలోని భద్రతా లోపాలను ఎత్తి చూపింది.కొద్ది లో పెను ప్రమాదం తప్పింది.వనరుల శాఖ సిబ్బంది వెంటనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వాడిగా గుర్తించారు. బ్యారేజి ఏఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

]]>