తెలంగాణా లో ఉపాద్యాయ కొలువులు షురూ…

తెంగాణా లో ఉపాద్యాయ కొలువులకు పచ్చ జండా ఉపింది సర్కార్.విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.  15రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. TSPSC ద్వారానే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు.రాష్ట్రంలో మూడు లక్షల మంది టెట్‌ క్వాలిఫైడ్‌ అభ్యర్థులున్నారని,ప్రత్యేకంగా మరోసారి టెట్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. ఇక రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నందున పాత జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుందని స్పష్టం చేశారు. ఆరు నెలల్లో టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పట్లో ఉపాధ్యాయ బదిలీలు ఉండకపోవచ్చని చెప్పారు మంత్రి కడియం.

]]>