వద్దక పోతే …నగదు తీసుకెళ్లండి..ఇచ్చేస్తాం

రేషన్‌కార్డుపై బియ్యం వద్దనుకొంటే వారికి నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనిముఖ్య మంత్రి  చంద్రబాబు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో శనివారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోతవరం, నల్లజర్లలో జరిగిన బహిరంగ సభల్లో అయన పాల్గొని మాట్లాడారు. ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఇప్పటికే రేషన్‌కార్డు ద్వారా బియ్యం అందిస్తున్నాం. బియ్యం వద్దు అనుకొంటే వారికి నగదు ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని  ఎన్నైకల్లో ఇచ్చిన హామీ ని నిలబెట్టుకొనేనెదుకు తెలుగు దేశం కట్టుబడి ఉందని త్వరలో నిరుద్యోగులకు భృతి అందించే విషయంలో విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి విధివిధానాలు ఖరారైన వెంటనే తదుపరి చర్యలకు దిగుతామని సీఎం ప్రకటించారు.

రాష్ట్రంలో పశ్చిమ గోదావరి అన్ని ఇళ్ళకి గ్యాస్  తొలి స్థానంలో,ఉండటమే కాకుండా  ఓడీఎఫ్  లో కూడా ముందుందని అన్నారు ఈ రెండింటిలోనూ జిల్లా తొలి స్థానంలో నిలవడంగర్వంగాఉందన్నారు.ప్రభుత్వం పట్ల పాజిటివ్‌గా వ్యవహరించాలి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రోత్సహించాలి’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో చాలా మంది తమకు ఇళ్లు, ఇంటి స్థలాలు కావాలని కోరుతున్నారని, రాబోయే రెండేళ్లలో అర్హులైన వారందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు కచ్చితంగా ఇచ్చి తీరుతాం’ అని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఉన్నవారు, ఉద్యోగాల్లో ఉన్నవారు అవినీతిరహితంగా వ్యవహరించాలన్నారు.
]]>