‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ల దూసుకుపోతున్న సందీప్….

విలన్లుగా కెరీర్ స్టార్ట్ చేసిన నటులంతా టాలీవుడ్ హీరోలుగా ఓ రేంజ్ లో సెటిలైపోయారు. ఈ బ్యాచ్ లోకే వస్తాడు హ్యాపెనింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్.డైరెక్టర్ క్రిష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నక్షత్రం’లో సందీప్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేసాడు.ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు ఛోటాకేనాయుడు, శ్యామ్ కే నాయుడు మేనల్లుడిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సందీప్ కిషన్ మొదట గౌతమ్ వాసుదేవ మీనన్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. ఆ తరువాత దర్శకుడు దేవకట్టా తెరకెక్కించిన ‘ప్రస్థానం’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి తొలిసారిగా వెండితెర పై కనిపించాడు. ‘ప్రస్ధానం’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు సందీప్ కిషన్ నటనకి మంచి మార్కులు పడ్డాయి.

‘ప్రస్థానం’ తరువాత వచ్చిన ‘స్నేహగీతం’ సినిమాతో విలన్ నుంచి హీరో స్టేటస్‌కి ప్రమోట్ అయ్యాడు సందీప్. ‘స్నేహగీతం’ కూడా యూత్‌ని ఎట్రాక్ట్ చేయడంతో రాను రాను సందీప్ కి టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువ ఎక్కువైంది. అయితే ఆ పాత్రలన్నీ కేవలం సెకండ్ హీరో వరకే పరిమితం అయ్యాయి. దీంతో సరైన బ్రేక్ కోసం వేచి చూస్తోన్న సందీప్ కి సడెన్ గా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ వచ్చి సూపర్ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఇక సందీప్ వెనుతిరిగి చూసింది లేదు. మినిమమ్ గ్యారెంటి హీరోగా ట్రేడ్ వర్గాలు సందీప్ కిషన్ కి ఓ మార్క్ ఇచ్చేసారు. ‘వెంకట్రాది ఎక్స్ ప్రెస్’ తరువాత సందీప్ ని మాస్ ఆడియెన్స్ కు దగ్గర చేసిన సినిమా టైగర్. ఈ సినిమాతో కమర్శీయల్ హీరోగా సందీప్ మరో మెట్టు పైకి ఎక్కాడు. అయితే డిఫరెంట్ కంటెంట్ ఉన్న స్టోరీల్ని ఎంచుకోవడానికి ఇష్డపడే సందీప్ ఆ పంథాలోనే కెరీర్ ని సాగిస్తున్నాడు.

సందీప్ నటించిన ‘రన్’, ‘ఒకఅమ్మాయి తప్ప’ వంటి చిత్రాలు ఈ కోవలోనికే వస్తాయి. ఇక తమిళంలో కూడా సందీప్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అరవంలో మార్కెట్ పెంచుకుంటున్న తెలుగు హీరోల్లో సందీప్ కిషన్ ముందంజలో ఉన్నాడు. ప్రస్తుతం మూడు తమిళ సినిమాలు సందీప్ చేతిలో ఉన్నాయి.మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల్ని సందీప్ ఏ రేంజ్ లో ఏంటర్ టైన్ చేస్తాడో చూడాలి.

]]>