విద్యాసాగర్ రావు అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. హబ్సిగూడాలోని ఆయన నివాసం నుంచి అంబర్పేట్ స్మశానవాటిక వరకు విద్యాసాగర్ రావు అమర్‌రహే నినాదాల తో పార్థీవదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైన ఒక ప్రాజెక్టుకు విద్యాసాగర్ రావు పేరు పెడతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.అత్యంత ఆప్తుడిని కోల్పోయినట్లు చెబుతూ కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు విద్యాసాగర్‌రావును చివరిసారిగా చూసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.అంత్యక్రియలకు మంత్రి హరీష్ రావు, గద్దర్ కుటుంబ సభ్యులు హాజర్యయ్యారు.ఇంకా పలువురు నేతలు, ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న విద్యాసాగర్ రావు భార్య సుజాతను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
]]>