మాల్యా విల్లా అమ్ముడైంది….

 గోవాలోని విజయ్ మాల్యాకు చెందిన విలాసవంతమైన కింగ్ ఫిషర్ విల్లా  అమ్ముడైంది.సినీ నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి ఈ విల్లాను సొంతం చేసుకున్నారు.కండోలిమ్‌లో అరేబియా సముద్రానికి ఎదురుగా ఈ విల్లా ఉంది.ఈ విలాసవంతమైన విల్లాలో అన్ని రకాల సదుపాయాలు,వసతులు ఉన్నాయి.వేలంలో ఈ విల్లాను కొనుగోలు చేసేందుకు కొందరు ఆసక్తి చూపినా రిజర్వ్ ధర చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.సంప్రదింపుల ద్వారా బేరం మాట్లాడుకుని సచిన్‌ జోషికి అమ్మేందుకు అంగీకరించారు.చివరి సారి వేలంలో నిర్ణయించిన రిజర్వ్ ధర 73 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం చెల్లించేందుకు ఆయన అంగీకరించారు.చివరకు ఈ విల్లాను సచిన్ జోషి సొంతం చేసుకున్నారు.ఈయన  హిందీ చిత్రాలు అజాన్, ముంబై మిర్రర్, జాక్‌పాట్‌లలో నటించారు.

]]>