ఆ జైలు నిబంధనలు గాలికి ..శశి కళకు వీవీఐపీ ట్రీట్మెంట్ ..

ఖైదీల్లా  ఉండలేను నన్ను ఒక ప్రత్యేకమైన ఖైదీ హోదా ను ఇవ్వాలని ఆస్తుల కేసులో  శిక్ష పడిన శశికళ సుప్రీమ్ కోర్ట్ కు విన్నవించుకున్నా విషయం తెలిసిందే ..ఆమె అభ్యర్ధన ను తోసిపడేసిన సుప్రీమ్ కోర్టు సాధారణ ఖైదీ లాగానే ఉండాలని తీర్పు ఇచ్చింది ..కానీ పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ ..అక్కడ మహారాణి వైభోగాలనే అనుభవిస్తోన్నదని మీడియా  లో ప్రచారం సాగుతోంది ఆర్టీఐ చట్టం ద్వారా ఒక సమాచారాన్ని వెల్లడైన విషయాన్ని బట్టి చుస్తే శశి కల ను జైల్లో కలిసేందుకు జనం క్యూ  కడుతున్నట్టు తెలిసింది , అంతే కాదు నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ సేపు  జైల్లో గడుపుతూ బైట వ్యవహారాలన్నీ చక్క బెడుతున్దట శశికళ.

జైలు నియమాల ప్రకారం 15 రోజులకు ఒకసారి మాత్రమే బంధువులను అనుచరులను కలిసే అవకాశం వుంది , కానీ పరప్పన జైల్లో  ఆ నియమాలేవి అమల్లో  లేవు అంటున్నారు , ఇంకా చెప్పాలంటే వీవీఐపీ  ట్రాట్మెంట్ ఇస్తున్నారట శశికళ కు, ఒక్క నెల రోజుల్లోనే ఆమెను కలిసేందుకు 19 మంది వచ్చి వెళ్లారట ,అంతే కాదు 5 నిమిషాలకంటే ఎక్కువ సేపు ఉండకూడదు అని తెలిసినా అంతకుమించిన సమయమే ఆమెతో మాట్లాడి వెళ్లారట,శశి కల ను కలిసిన వారిలో స్పీకర్  తంబీ దురై ,దినకరన్, …దీన్ని బట్టి చూస్తే  చట్టాలు కేవలం వినడానికి చదవడానికి తప్ప ఇంకెందుకు పనికి రావు అనే భావన కలుగక మానదు …

]]>