ఇక ప్లాస్టిక్ కోడి గుడ్ల వంతు..కలకత్తా లో బైటపడ్డ మోసం

ప్లాస్టిక్ బియ్యం వంతు ఐపోయింది ఇప్పుడు ప్లాస్టిక్ కోడిగుడ్ల వంతు  కోల్ కతాలో ఘరానా మోసం బయటపడింది. కరేయా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు.. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. దుకాణంలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన ప్లాస్టిక్ కోడిగుడ్లను స్వాధీనం చేసుకున్నారు.

కోడిగుడ్లు ఉడక పెడుతుండగా  అనుమానమొచ్చిన మహిళ.. వాటిని పరిశీలిస్తే అవి ప్లాస్టిక్ గుడ్లు కన్ స్యూమర్ కోర్టులో ఫిర్యాదు దీనిపై కోల్ కతా మేయర్ విచారణకు ఆదేశిస్తామన్నారు. తను ఎప్పుడూ వినడమే కానీ చూడలేదని.. సిటీలో తొలిసారి చూశాను అంటున్నారు  కోల్ కతా మేయర్. కేరళలోనూ ఇలాంటి గుడ్లనే అమ్ముతున్నారన్న ప్రచారం జరిగింది గతం లో . చైనా నుంచి దిగుమతి అవుతున్నట్టు అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో కోడి గుడ్డులో తేడా ఉంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది కేరళ ప్రభుత్వం. … చైనా గుడ్డు గోధుమ రంగులో ఉంటుంది. మామూలు గుడ్డుకు వచ్చే వాసన చైనా వాటికి రాదు … గుడ్డు పగలగొట్టిన తర్వాత ఈగలు, దోమలు వాలవు. ఎన్ని నెలలు అయినా గుడ్డు చెడిపోదు. … చైనా గుడ్డు పెద్ద సైజులో ఉంటుంది. సాధారణ గుడ్డు కంటే మెరుపు ఎక్కువ … పెంకు కూడా రఫ్ గా ఉంటుంది. చైనా గుడ్డును ఊపగానే సౌండ్ చేస్తుంది. సహజమైన గుడ్డు ఎలాంటి శబ్దాలు చేయదు. … చైనా గుడ్డును పగలకొట్టగానే తెల్లసొన.. పచ్చ సొన కలిసిపోతాయి. … చైనా గుడ్డు వేపుడు చేసేటప్పుడు పచ్చసొన దానికదే ప్యాన్ లో పాకిపోతుంది..సో బె కేర్ ఫుల్ ఎగ్ లవర్స్]]>