మీరూటేమిటో చెప్తే నేనూ వస్తా కోదండరాం

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ గల్ఫ్ దేశాల్లో బాధలు పడుతున్న వారి కోసం తెలంగాణ గల్ఫ్ భరోసా పేరుతో హైదరాబాద్‌లో సెమినార్ ఏర్పాటు చేసింది.సెమినార్‌లో కోదండరాం పాల్గొన్నారు. ఈ సెమినార్‌కు టీ.జేఏసీ చైర్మన్ కోదండరాంతో పాటు పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. గల్ఫ్ దేశాల్లో బాధలు పడుతున్న వారిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది టీ కాంగ్రెస్. గల్ఫ్ దేశాల్లో బాధలు పడుతున్న వారి కోసం స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తే తాము కూడా సహకారం అందిస్తామని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. కార్యాచరణ లేకుండా ముందుకెళ్తే ఎలాంటి ప్రయోజనం ఉండదనికోదండరాం అంటున్నారు .

]]>