***************
మన..
పల్లెటూరి..
ఆచార వ్యవహారాలు..
భలే ముచ్చటగా ఉంటాయి..
ఇన్ఫర్ మేటివ్ గా కూడా ఉంటాయ్.!!
**********
ఆడపిల్ల..
పుట్టిన నాటి నుండి..
తాను తల్లైయ్యే వరకు ప్రతీ మజిలీ ఓ పండగే.!
అమ్మాయి..
‘జిందగీ’లో..బారసాల మొదటి పండగ.
పుట్టువెంట్రుకలు..పుట్టులంగాలు..పుష్పవతి చీర వేడుక..
పెళ్లిచూపులు..పెళ్లి..సీమంతం..మళ్లీ తనకు పుట్టిన సంతానానికి..పురుడు పోయడం లాంటి సైకిలింగ్ ఫంక్షన్లతో..
ఎప్పుడూ పుట్టిల్లు కళకళలాడుతూ ఉంటుంది.!!
సో..
ఆ క్రమంలో వచ్చే..
పురుడు నాడు బాలింతరాలితో..
బావిలో నీళ్లు చేదించడం వెనక కూడా మంచి విషయముంది.!
కొత్త పెళ్లి కూతురు..
నెల తప్పిన నాటి నుండి..
ప్రసవించే వరకు గాజు బొమ్మలా..
అపురూపంగా చూసుకుంటుంటారు.ఉట్టి మనిషి కాదని.!!
ఇక..
అసలు విషయానికొస్తే..
ప్రసవించిన 21.రోజున పురుడు పోస్తారు.
ఆరోజు పుట్టింటోళ్లు..అత్తింటోళ్లకు..మా అమ్మాయి..
అదే మీ కోడలు పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు మీరు ఎంచక్క అత్తింటికి కాపురానికి తీసుకెళ్లొచ్చని ‘ఆచారం’పేరిట పరీక్షించి వియ్యపురాలికి అప్పజెప్తారు.!!
మరి..ఇప్పుడు.!
******
పాతికేళ్ల క్రితం వరకు..
అందరిళ్లలో చేద బావులుండేవి..
ప్రస్థుతం..ఇంటింటికీ బోరు బావులుండడం వల్ల..
ఆచారం అలాగే ఉంది..బోర్ ఆన్ చేసి బిందెకు బదులు చిన్న చెంబు నింపి పట్టుకు రమ్మంటున్నారు.అప్పుడు నార్మల్ డెలివరీలు 21 రోజుల్లోనే కోలుకుని పనులకెళ్లే వాళ్లు..
ఇప్పుడన్నీ..ఇష్టపూర్వక సిజేరియన్ ఆపరేషన్లు కాబట్టి..
నీళ్లు చేదకూడదు..బిందె మోయకూడదు..కుట్లు తెగుతాయని..మూణ్ణెళ్ల తరవాతే అత్తింట్లో అడుగు పెడుతున్నారు.. ‘ఆచారం’వెనక అసలు కథ అది]]>