ట్రంప్ దెబ్బకి తలొగ్గుతున్న భారతీయ ఐటీ కంపెనీలు

భారతీయకంపెనీ ఇన్ఫోసిస్ నిర్ణయాన్ని అమెరికన్  ప్రెసిడెంట్ ట్రంప్ స్వాగతించారు.అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్స్ కే అని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమెరికా అధ్యక్షుడి పీఠాన్ని కొట్టేసిన డోనాల్డ్ ట్రంప్ మాట నిలబెట్టుకోవడం మొదలు పెట్టి అందుకు తగట్టుగానే ఉద్యోగాలని కల్పిచేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆయా దిశగా చర్యలు ప్రారంభించైనా విషయం తెలిసిందే అంతే కాదు అమెరికన్స్ కి ఉద్యోగాలు ఇవ్వకపొతే చర్యలు కూడా తీసుకుంటామని అవసరం ఐతే అమెరికా వదిలి వెళ్లొచ్చని  విదేశీ కంపెనీలకి హెచ్చరికలు కూడా  చేసారు ట్రంప్ , ఈ  హెచ్చరికల్ని మొదట్లో అంత గా పట్టించుకోనట్టు  కనిపించినా చివరికి ట్రంప్ మాటలకి చేతులకి తలొగ్గక తప్పలేదు ఐటి కంపెనీలు

 భారతీయ  కంపెనీ  ఇన్ఫోసిస్ రానున్న రెండేళ్లలో అమెరికన్స్ కి 10 వేల  ఉద్యోగాలిస్తామని ప్రకటించింది..హెచ్ 1బి వీసా నిబంధనల నేపద్యం లో ఇన్ఫోసిస్ రానున్న రెండేళ్లలో ఇన్ఫోసిస్ అమెరికా లో మరో నాలుగు డెవలప్ మెంట్ సెంటర్ లను తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ మేరకు వాషింగ్ టన్న పోస్ట్ లో ఒక కధనం వెలువడింది ట్రంప్ రాజకీయ విజయ అంటూ  ట్రంప్ ని ఆకాశానికెత్తేసింది .రానున్న రోజుల్లో అమెరిసిక ఆర్ధిక స్థితిని ప్రభావితం చేస్తాయని ప్రోత్సాహక ఆర్ధిక ఎజెండా అని అన్నాయి ట్రంప్ దెబ్బకి భారతీయ కంపెనీలు దిశను నిరణయాన్ని మార్చుకోక తప్పదు అనేది ఇన్ఫోసిస్ నిర్ణయం తో డిసైడ్ అయ్యింది ..భవిష్యత్తులో మరిన్ని మార్పులు చూడాల్సి వస్తుందేమో ..!

]]>