ప్రజాప్రతినిధులు అడవుల్లో ఉండాలా ?రేవంత్ రెడ్డి

ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తమను చట్టసభల్లోకి రాకుండా కేసీఆర్‌ ప్రభుత్వం అడ్డుకుంటోందని, రైతుల కష్టాలు తెలుసుకునేందుకు మార్కెట్‌ యార్డ్ కు కూడా వెళ్లనివ్వడం లేదని టీడీపీ-టీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి అన్నారు. తామంతా అడవిబాట పట్టాలని సర్కారు కోరుకుంటోందని టీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట రైతుదీక్ష నిర్వహించారు.

ఈ దీక్షలో రేవంతతోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీతక్క, జైలు నుంచి విడుదలైన 10 మంది రైతులు ఉన్నారు దీక్ష అనంతరం రేవంత మాట్లాడుతూ కేసీఆర్‌ సర్కారు ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తోందనీ, సమస్యలపై ఆందోళనలు చేసేందుకు అనుమతించకుండా అణచివేత ధోరణికి పాల్పడుతోందని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమం తరువాత అప్పటి ప్రభుత్వం ఇదేవిధంగా అణచివేతకు పాల్పడడంతో గద్దర్‌, గణపతి, ఆర్‌కె, సాంబశివుడు లాంటి ఎంతో మంది అడవిబాట పట్టారని.రైతులు మిర్చిని తీసుకొస్తే వ్యాపారులు 2, 3వేల రూపాయలకు క్వింటా చొప్పున అమ్మాలని బెదిరించారని ఆరోపించారు. రైతులు కడుపు మండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే వారిపై రాజద్రోహం కేసులు పెట్టారన్నారు.

]]>