ఆ శాఖలకు ఇద్దరు చంద్రుల తనయులే ఎందుకో ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రెండు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ జరుగనుంది  నూతన రాష్ట్రము ఏర్పడి అధికారం లోకి వచ్చిన తర్వాత మంత్రివర్గాన్ని చంద్రబాబు విస్తరించలేదు. తాజాగా  ఎంఎల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తనయుడు లోకేష్ విజయం సాధించారు దీనితో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడానికి  మార్గం సుగమం అయ్యింది, ఇప్పటికే మంత్రి వర్గం లో  లోకేష్ కి ఐటీ మరికొన్ని శాఖలు కట్టబెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.శర వేగం గా నిర్మాణం  అవుతున్న నవ్య ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రి వర్గం లో యువత కు ప్రాధాన్యత నివ్వడం ఆహ్వానించ తగిన పరిణామం

ఇదిలా ఉండగా అటు తెలంగాణ రాష్ట్రము లో కూడా ముఖ్యమంత్రి చంద్ర శేఖర రావు తనయుడు కేటీఆర్ కూడా ఇవే  శాఖల బాధ్యతలు  నిర్వహిస్తున్నారు .వీరిద్దరూఇవే శాఖలకు మంత్రులు కావడం కాకా తాళీయమే ఐనా  నేటి సమాజానికి అవసరమైన వనరులు అవసరాల పట్ల మంచి పట్టు టెక్నాలజీ ని వాడటం లో అనుభవం ఉండటం రెండు రాష్ట్రాలకి నిధులు , ఉద్యోగ అవకాశాలు , పరిశ్రమలు వస్తాయని యువతకు మేలు  జరుగుతుందని ఆశిద్దాం..

]]>