సినిమా ప్రారంభం రోజునే అభిమానులకు హీరో టచ్లోకొస్తే, ప్రారంభోత్సవాన్ని యూట్యూబ్లో చూపిస్తే… ఐడియా అదిరింది కదూ. ఇది రామ్ ఐడియా. ఉగాది నాడు ఆయన కొత్త సినిమా ఆరంభం కాబోతోంది కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన ‘నేను శైలజ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ రీపీట్ అవుతోంది. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్న ఈ చిత్రం ఉగాది పర్వదినాన ఆరంభం కానుంది. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ కథానాయికలు. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఉదయం 10 గం 25 నిమిషాలకు ఈ చిత్రం ఆరంభం అవుతుంది. ఈ కార్యక్రమం ‘రామ్’ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.తర్వాత రామ్ తన అభిమానులతో చాట్ చేయనున్నారు రామ్ ని ప్రశ్నలు ఏమైనా అడగాలి అనుకుంటే ఆడియోన్స్ రెడీ గా ఉండండి.
]]>