భారతీయ జనతా పార్టీ తెలంగాణం అందుకుంది అదేమిటిఅంటే మహారాష్ట్ర లో శివసేన వంటి పార్టీ ల మద్దతు లేకపోయినా ఒంటి చేత్తో గెలవగలమని భవిష్యత్తు లో తెలంగాణ లో కూడా అదే విధం గా గెలిచే అవకాశాలున్నాయి అని అంటోంది..భారతీయ జనతా పార్టీ స్పోకెన్ మెన్ కృష్ణ సాగర్ రావు మాటలు అలాగే ఉన్నాయి . గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తో పొత్తు వల్ల కలిసి వచ్చిందేమీ లేదని అంటూనే ప్రసుతం తెలంగాణ లో ప్రత్యామ్నాయ పార్టీ భాజపా మాత్రమే అని మోడీ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి గా ఉన్నారు అనేందుకు ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే గీటు రాయి అని మోడీ – అమిత్ షా కాంబినేషన్ లో కొత్త ప్లాన్ ఉన్నదని అంటున్నారు .
అంతే కాకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రము లో భాజపా వెళ్ళోనుకునేందుకు ఇదే మంచి సమయమని అంటున్నారు , రానున్న 2019 ఎన్నికల్లో తెలంగాణ లో లోక్ సభ ,అసెంబ్లీ సెట్లలో ఒంటరిగా పోరుకు దిగుతామని పొత్తులు ఉండవని , ప్రధాన పోరు టీఆర్ఎస్ – భాజపా ల మధ్యనే ఉండబోతోందని జోస్యం చెప్పారు .కాంగ్రస్ పార్టీ ప్రజల్లో విలువను కోల్పోయిన పార్టీ అని ఇక తెలుగు దేశం ఎప్పటి లాగే తమ తో జట్టు కట్టి లాభం పొందిందని , రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని అంటున్నారు ..ప్రాంతీయ పార్టీలకి ..స్థానిక నాయకత్వానికి పట్టం కట్టే తెలుగు ప్రజలు జాతీయ పార్టీ ని ఆదరిస్తారో లేదో ..
ఇంత కాంఫిడెన్స్ 2014 ఎన్నికల్లో ఎటుపోయిందో ఇప్పుడు తెలుగుదేశం వల్ల ఒరిగిందేమి లేదంటున్నారు ,ప్రతిసారి ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం అంతా అయ్యాక మీరంటే మీరనడం పరిపాటిగా మారింది రెండు పార్టీ లకి..
]]>