యుంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ సరికొత్త లుక్, బాడీలాంగ్వేజ్‌తో న్యూ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్స్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు.ఇదే కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ నేను శైలజ మంచి హిట్ ఇచ్చింది.అంతకు మించి క్రేజ్ తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానుంది.
]]>