అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే ఎలా ..!

అసలు జుట్టు ఊడటానికి,మెడ,వీపు మీద పింపుల్స్ రాషెస్ వంటి వాటన్నిటికీ ముఖ్య కారణం డాండ్రఫ్ ముందు డాండ్రఫ్ పొతే అన్ని సమస్యలు తొలిగి పోయినట్లే.అసలు ఈ డాండ్రఫ్ ను ఎలా పోగొట్టు కోవాలో ఈ క్రింది తెలుపబడిన చిట్కాలను ట్రై చేసి చుడండి.

**3-4 రోజులకోసారి షాంపూ,కుంకుడుకాయ,షీకాకాయ తోనో తలస్నానం చేయాలి. తల పరిశుభ్రం గా ఉంటే చాలా వరకు తలకు బ్యాక్టీరియా, ఫంగల్ ఇంఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అందుకే తల శుభ్రంగా ఉంచుకోవాలి.

** రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపులను వెంటనే తగ్గించండి.తేలిక పాటి షాంపూలు మాత్రమే వాడండి.

**బాగా మరగ పెట్టిన వేడి నీటి తో తల స్నానం చేయకండి.

**ఆస్పిరిన్ టాబ్లెట్ చుండ్రుకు మంచి ఔషధం.ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ ను తీసుకుని దానిని పొడి చేసి ఒక బట్టలో చుట్టి నీళల్లో ముంచి ఆ నీటిని తలకు రాసుకోవాలి . 2 నిముషాలు మాత్రమే ఉంచి తర్వాత తల స్నానం చేయాలి.

**కోడిగ్రుడ్డులో పోషకాలు తలపై చక్కగా పని చేస్తాయి.గ్రుడ్డు ని తీసుకుని తలకు పెట్టుకుని ఒక గంట తర్వాత  తల స్నానం చెయ్యాలి.ఇలా వారానికి 2 సార్లు చేస్తే చుండ్రు తగ్గి జుట్ట్టు పెరుగుతుంది.

**పెరుగు లో మిరియాల పొడిని కలిపి తలకు పెట్టుకుంటే మంచిగా పనిచేస్తుంది.ఒక గంట ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

**హెన్న(గోరింటాకు) చుండ్రును సమర్ధవంతంగా తొలగించగలదు.హెన్న తీసుకుని దానిలో కొన్ని చుక్కలు నిమ్మ రసాన్ని అలాగే ఆలివ్ ఆయిల్ ను కలిపి తలకు పట్టించుకోవాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది చుండ్రును తొలగించటంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.జుట్టు కి ఇది ఒక మంచి కండిషనర్.

**ఆపిల్ జుట్టు రాలడాన్ని చుండ్రును కూడా తొలగిస్తుంది. ఆపిల్స్ ను తీసుకుని పేస్ట్ గా చేసుకుని తలకు పట్టించాలి. 15 నిముషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి.

**చర్మం పై,దురదా,తామర ఫంగల్ ఇంఫెక్షన్ వల్ల వస్తుంది.స్కాల్ప్ పరిశుబ్రత పాటిస్తే ఇవి వచ్చే అవకాశాలు తక్కువ. రోజూ షాంపూ వాడటం వల్ల మీరు తామరకు దూరంగా ఉండవచ్చు.

]]>