మహిళలూ…సాహో

nppmm

భారతదేశంలో నే మొట్టమొదటిసారిగా ఏపీలో మహిళా పార్లమెంటేరియన్ సదస్సు విజయవాడలో నిర్వహించడంసంతోషం గా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.పవిత్రమైన కృష్ణానది ఒడ్డున జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు జరగడం సంతోషంగా ఉందని అన్నారు. శాతవాహనుల రాజధానిగా ఉన్న అమరావతి నుంచే బౌద్ధ మతం ప్రచారం విస్తరణ జరిగిందని అన్నారు .

మహిళల అభ్యున్నతికి అన్న ఎన్టీఆర్‌ ఎంతో కృషిచేశారని, తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు కల్పించిన ఘనత ఆయనదేనని ,మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తొలిసారిగా కోరింది కూడా తెలుగుదేశం పార్టీ అని  అంతే కాకుండా చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామని, విద్యా, ఉద్యోగాల్లోనూ 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా సాధికారిత సాధించేవరకు విశ్రమించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్‌ నాటికి రాష్ట్రంలో వందశాతం గ్యాస్‌ కనెక్షన్లు అందజేస్తామన్నారు. ఐటీ రంగంలో మహిళలు సమర్ధవంతంగా రాణిస్తున్నారు అని ప్రశంసించారు .
మహిళా సాధికారికత అసాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో బౌద్ధ గురువు దలైలామా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, పాండిచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీ, మనీషా కోయిరాల, పలువురు దేశవిదేశాల నుంచి వచ్చిన 1200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజులపాటు ఐదు ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారు.
నేషనల్ విమెన్ పార్లిమెంట్ లైవ్ ఈ లింక్ ద్వారాచూడండి 
[embed]http://www.youtube.com/watch?v=YOvMROrN-ZU[/embed]
]]>