తరువాత జగన్ వంతు !

తప్పులు చేయడంవల్లే ఇప్పుడు తమిళనాట శశికళ జైలుకెళ్లారని… రానున్న రోజుల్లో ప్రతిపక్ష నాయకుడు జగన్ పరిస్థితి అదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు అంటున్నారు.తమిళ నాడు రాజకీయాల్లో జరిగిన నాటకీయ పరిస్థితులను వుంటంకిస్తూ అయన ఎలా అన్నారు ‘‘1995-96 నాటి కేసులో….సీఎం కాబోయే సమయంలో శశికళ జైలుకెళ్లాల్సి వచ్చింది.అని జగన్ పరిస్థితి కూడా దాదాపుగా శశి కళ లాగేఉంటుందని అన్నారు. 40 వేల కోట్ల అవినీతి కుంభకోణం. సూట్‌కేస్‌ కంపెనీలు, షెల్‌ కంపెనీలు, బోగస్‌ కంపెనీల బాగోతం. బయటకొచ్చే సమస్యే లేదు’’ అని పరోక్షంగా జగన్ కేసుల గురించి ప్రస్తావించారు.

కుప్పంలో రెండురోజుల పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు… గురువారం అక్కడి టీడీపీ కార్యకర్తల సమావేశం లో మాట్లాడారు ‘‘నాయకులు నిజాయితీగా ఉండాలి. నేను ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను. వాటన్నింటినీ ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు. మీలోని ఒకరిద్దరు తప్పులు చేస్తున్నా నన్ను చూసి ఓట్లేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. పదేళ్ల ప్రతిపక్ష పాత్రలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నామని, పరిటాల రవితోపాటు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలను పోగొట్టుకున్నామని అయన ఫీల్ అయ్యారు . ప్రజలపైన, పార్టీపైన నాయకులు కొంచెం శ్రద్ధ పెట్టాలని చంద్రబాబు సూచించారు.‘‘మన ప్రవర్తన బాగుండాలి. అపోజిషనలో ఉంటే ఏ పని చేసినా చెల్లుబాటవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అలా కుదరదు ‘‘ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని వారిని ఇబ్బంది పెడితే… ఎన్నికల్లో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. వైఎస్‌ ఉన్నప్పుడు వాళ్లు దోచుకున్నారు కదా… ఇప్పుడు మేం దోచుకుంటాం అని కొందరు అనుకుంటున్నారు! ఇందుకు చచ్చినా ఒప్పుకోను’’ అని తేల్చిచెప్పారు. 2004 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓడిన సంగతిని గుర్తు చేసారు ‘‘అప్పట్లో రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెంచాను. హైదరాబాద్‌లో రెడ్‌ అలర్ట్‌ పెట్టాను.కానీ… 2004 ఎన్నికల్లో మాత్రం ఓడించారు’’ అని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు అందరు ఉద్యోగులూ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారన్నారు. అయితే, వారిలో క్రమశిక్షణా రాహిత్యాన్ని, అవినీతిని క్షమించడం లేదని చెప్పారు. ‘‘ఎన్నికల ముందు కిలోమీటర్ల కొద్దీ పాద యాత్ర చేశాను. మనం అధికారంలోకి వచ్చాం. ఆ తర్వాత రాష్ట్ర విభజన ఓ చేదు గుర్తుగా మిగిలింది. ఏమీలేని శూన్యత నుంచి రాషా్ట్రన్ని పునాదుల నుంచి నిర్మిస్తూ అహర్నిశలూ కష్టపడుతున్నాం’’ అని తెలిపారు. ‘‘కొన్ని కారణాల రీత్యా హోదా ఇవ్వలేమని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. హోదాతో వచ్చే అన్ని ప్రయోజనాలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. దాని ఫలితంగానే పోలవరం ప్రాజెక్టు సాకారమవుతోంది. నాబార్డు ద్వారా వంద శాతం రీ ఫైనాన్సింగ్‌ చేస్తున్న ప్రాజెక్టు ఇదే’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. హంద్రీ-నీవా కాలువను మే మొదటి తేదీకల్లా కుప్పం తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని అన్నారు . అంటే కాదు తెలుగు దేశం నాయకులను ఉద్దేశించి ఇలా అన్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజలకోసం పోరాడుతూ అష్టకష్టాలు పడ్డాం. ఆ తర్వాతే అధికారంలోకి వచ్చాం. మనకు మనమే ప్రతి పక్షం దాంతోనే మనల్ని మనమే ఓడించుకుంటాం!’’ ఈ పద్దతికి స్వస్తి పలకాలని అన్నారు .

]]>