విజయ్ నటించిన తాజా చిత్రం.."ద్వారకా"

2000-notes-will-ban-soon

vijay“పెళ్లిచూపులు”తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం “ద్వారక”. విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. “లెజెండ్ సినిమా” బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు నిర్మాతలు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్న ఈ చిత్రంఆడియో విడుదలతోపాటు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది.

మార్చి 3న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర మాట్లాడుతూ.. “క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “ద్వారక” ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దొంగ స్వామిజీగా విజయ్ దేవరకొండ నటన, పూజా ఝావేరి గ్లామర్, వైవిధ్యమైన కథ-కథనాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. విడుదలైన పాటలతోపాటు.. ట్రైలర్ కి కూడా మంచి ఆదరణ లభించింది. సినిమాకి కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది. మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు.

పృథ్విరాజ్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, సురేఖావాని, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, నిర్మాతలు: ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు, దర్శకత్వం: శ్రీనివాస్ రవీంద్ర!

]]>