శ్రీవారిని దర్శించుకున్న జూనియర్ ఎన్టీఆర్ దంపతులు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి ల తో పాటు కొరటాల శివ సుప్రభాత సేవలో పాల్గొన్నారు.శ్రీవారికి మొక్కులు చెల్లించారు. వీళ్లకు ఆలయ పండితులు.రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.

సమ్మర్ హాలీడేస్ రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.తిరుమల తీర్థంలో లక్షల మంది భక్తులు.. స్వామిని దర్శించుకుంటున్నారు. కొండ ఎక్కుతున్న భక్తులు కూడా ఈసారి బాగా పెరిగారు.అన్ని కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండాయి. 2 కిలోమీటర్ల వరకు భక్తులు క్యూ కట్టారు. ఫ్రీ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నడిచి వెళ్లే భక్తులకు 10 గంటలు.స్పెషల్ దర్శనానికి 6 గంటల సమయం పడుతోందంటున్నారు ఆలయాధికారులు.

]]>