రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన యంగ్ టైగర్….

134

యంగ్‌ టైగర్ జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత అద్భుతమైన కాన్వాస్‌  బాహుబలి-2 అన్నారు.బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రనే కాదు,భారతీయ సినిమాను మరో కొత్త లెవల్‌కి తీసుకెళ్లిందంటూ అభినందనల్లో ముం‍చెత్తారు.  ఈ  సందర్భంగా  ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, రమ్య క్రిష్ణన ల అద్భుతమైన నటనతో రాజమౌళి విజన్‌కు మద్దుతిచ్చారని ట్వీట్‌ చేశారు. రాజమౌళి కలను సాకారం చేసిన శోభు, ప్రసాద్ సహా నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర  యూనిట్‌ అందరికీ తారక్‌ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసారు.

]]>