చంద్రబాబు చూసుకుందాం రా

సీఎం చంద్రబాబు ప్రజస్వామ్యానికి బద్దం గా  వ్యవహరించలేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. చంద్రబాబు వైఖరి పట్ల ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు , న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీటీసీకి రూ.20 లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారని, కిడ్నాప్‌ చేసి ఓట్లు వేయించుకుని గొప్పలు చెబుతున్నారని ఎంపీటీసీల అభిప్రాయం ప్రజల అభిప్రాయం కాదని ఆయన అన్నారు. పార్టీ మారిన 21 మందితో రాజీనామా చేయించాలని, కడపలో చంద్రబాబు పోటీ చేసి గెలవాలని జగన్‌ సవాల్ విసిరారు. కడపలో వైసీపీ బి ఫామ్ ద్వారా గెలిచిన వారు 521 మంది, టీడీపీ 303 మంది, నెల్లూరులో వైసీపీ బి ఫామ్ ద్వారా గెలిచిన వారు 475మంది, టీడీపీ 344కి మంది, కర్నూల్‌లో వైసీపీ బి ఫామ్ ద్వారా గెలిచిన వారు 531మంది, టీడీపీ 454 మంది గెలిచారని లెక్కలు చెబుతు, మరిప్పుడు ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తికి అవినీతి గురించి మాటాడే నైతిక హక్కు లేదని జగన్ తేల్చిచెప్పారు. గత బడ్జెట్లో కాపులకు కేటాయించిన వెయ్యి కోట్లు ఖర్చు చెయ్యకుండానే ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని తెలిపారు. తప్పుడు లెక్కలు చూపించి ఒక పద్ధతి ప్రకారం ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వేరే పార్టీ నుండి గెలిచిన వ్యక్తులను డబ్బుతో కొని ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు సిగ్గుతో తలవంచి పదవికి రాజీనామా చెయ్యాలని జగన్ డిమాండ్ చేశారు.
]]>