వైఎస్ఆర్ సిపీ ఎంఎల్ఏ అరెస్ట్

ysrcp

మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రోజాను గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద  పోలీసులు అరెస్ట్ చేశారు. దలైలామా వెళ్తున్నారని పోలీసులు ఆపడంతో రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. రోజా ను గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు.

మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు వైఎస్‌​ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆహ్వానించి గన్నవరం ఎయిర్ పోర్టులోనే నిర్బంధించారు. సదస్సులో పాల్గొనేందుకు ముందుగానే అందరు ఎమ్మెల్యేలలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆమె.. శనివారం గన్నవరం చేరుకున్నారు. గంటసేపు ఎయిర్‌ పోర్టులోనే నిర్బంధించి.. ఆ తర్వాత పోలీసు బందోబస్తుతో రోజాను విజయవాడకు తరలించారు. ఒక వైపు మహిళల హక్కుల కోసం పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహిస్తూ.. మరోవైపు మహిళా ఎమ్మెల్యేను నిర్బంధించడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు శాసన సభ్యురాలు రోజాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని వైఎస్‌ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ విమర్శించారు.
]]>